Vijayawada: విజయవాడ పంజా సెంటర్‌లో ఘనంగా 'జష్నే ఈద్ మిలాదున్నబీ'!

Vijayawada: విజయవాడ పంజా సెంటర్‌లో ఘనంగా ఈద్ మిలాదున్నబీ బయాన్. పాల్గొని మత పెద్దలను శాలువాలతో సత్కరించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Aug 2026 12:06 PM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడ పంజా సెంటర్‌లో ఘనంగా 'జష్నే ఈద్ మిలాదున్నబీ'!

Vijayawada: విజయవాడ పాతబస్తీలోని ప్రసిద్ధ పంజా సెంటర్ వద్ద ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ‘జష్నే ఈద్ మిలాదున్నబీ’ ఆధ్యాత్మిక ప్రసంగం (బయాన్) కార్యక్రమంలో మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ​గుల్‌పోషి కార్యక్రమంలో భాగంగా ముస్లిం మత పెద్దలను, ఉలేమాలను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

​ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవితం మానవాళికి శాంతి, దయ, సమానత్వం మరియు పరస్పర సోదరభావాన్ని నేర్పుతుందని పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎల్లప్పుడూ సర్వమత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని పండుగలను అందరూ ఐక్యంగా జరుపుకోవడం ఇక్కడి విశిష్ట సంప్రదాయమని కొనియాడారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి తమ నాయకత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story