Vijayawada: విజయవాడ అభివృద్ధికి రూ.15 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులు: కేశినేని చిన్ని!

Vijayawada: విజయవాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఎంపీ లాడ్స్ కింద రూ.15 కోట్లలో ఇప్పటివరకు రూ.5.83 కోట్ల పనులను ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సిఫార్సు చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 8 Sept 2026 8:23 PM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడ అభివృద్ధికి రూ.15 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులు: కేశినేని చిన్ని!

విజయవాడ: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంపీ లాడ్స్ (మెంబెర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం ) ద్వారా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. 18వ లోక్‌సభ కాలానికి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం రూ.15 కోట్లు కేటాయించగా, అందులో రూ.5,83,54,032 విలువైన పనులకు సిఫార్సులు చేయబడ్డాయి. ప్రస్తుతం రూ.8,86,45,968 నిధులు అందుబాటులో ఉన్నాయి.

ప్రజా అవసరాలకు ప్రాధాన్యత

విజయవాడ పార్లమెంట్ పరిధిలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన తాగునీరు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాళ్లు, రహదారి మౌలిక వసతులు, కల్వర్టులు, సాగునీటి సదుపాయాలు, శ్మశానవాటికల అభివృద్ధి తదితర పనులకు ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రాధాన్యతనిస్తున్నారు.2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పలు పనులకు నిధులు మంజూరు కాగా, కొన్ని పనులు పూర్తయ్యాయి, మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. 2026–27 సంవత్సరానికి కూడా ప్రజల స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు కొత్త పనులను ప్రతిపాదించారు.రూ.3,26, 32,000పైగా పనులకు సిఫార్సులు 2025–26 సంవత్సరానికి అయితే 2026 -27 సంవత్సరానికి రూ 2,57,22, 032 పైగా పనులను ప్రతిపాదించారు.

వీటిలో ముఖ్యమైన పనులు

జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద కృష్ణా నదిపై ఎత్తిపోతల సాగునీటి పథకానికి 2300 HP పంప్‌సెట్ సరఫరా, ఏర్పాటు, విద్యుత్ మరియు యాంత్రిక పనులు.నందిగామ మండలం రాఘవాపురం గ్రామంలోని కమ్మవారిపాలెం వద్ద మంగళ వాగుపై కల్వర్టు, రిటైనింగ్ వాల్ నిర్మాణం.విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్‌లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం.వాంబే కాలనీ, 60వ డివిజన్‌లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం.

విజయవాడ 11వ డివిజన్‌లోని P&T కాలనీ నుంచి గురునానక్ కాలనీ రోడ్డు వరకు పైప్‌లైన్ ఏర్పాటు.ఆటోనగర్ ELSR నుంచి గురునానక్ కాలనీ రోడ్డు వరకు పైప్‌లైన్ ఏర్పాటు.నందిగామ మండలం మునగచెర్ల గ్రామంలో గ్రావిటీ మెయిన్ పైప్‌లైన్, 40 KL సంప్ ఏర్పాటు.

తిరువూరు 17వ వార్డులోని కమ్యూనిటీ హాల్‌లో MS గ్రిల్స్, గ్లాస్ ఇంటీరియర్, సీలింగ్, ఫ్లోర్ మరియు వాల్ టైల్స్ పనులు.ఎ.కొండూరు మండలం గొల్లమండల గ్రామంలో మామిళ్ల వాగుపై 1000 మి.మీ. వ్యాసం కలిగిన రెండు వెంట్ల పైప్ కల్వర్టుల నిర్మాణం.విజయవాడలోని బెజవాడ బార్ అసోసియేషన్ సిటీ సివిల్ కోర్ట్ కాంప్లెక్స్‌లో మహిళా బార్ అసోసియేషన్ భవన నిర్మాణానికి నిధుల కేటాయింపు.

జగ్గయ్యపేట మండలం బాలుసుపాడు గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం.మల్కాపురం గ్రామంలోని ఎస్సీ శ్మశానవాటికలో అభివృద్ధి పనులు.2026–27లో మరిన్ని అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజా అవసరాలకు అనుగుణంగా పలు పనులను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రతిపాదించారు.

ముఖ్య అంశాలు

పెనుగంచిప్రోలు మండలంలోని ఎస్సీ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం. అనిగండ్లపాడు ఎస్సీ కాలనీలో స్లాబ్ కల్వర్టు నిర్మాణం. నందిగామ మండలం మగల్లు గ్రామంలోని ఎస్సీ శ్మశానవాటికకు ప్రహరీ గోడ నిర్మాణం. వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో సంప్‌వెల్ నుంచి రామరాజు చెరువు వరకు సీసీ డ్రెయిన్ నిర్మాణం. మక్కపేట గ్రామంలో రామరాజు చెరువు సమీపంలో కల్వర్టు నిర్మాణం. చుక్కపల్లి నాగేశ్వరరావు ఇంటి నుంచి రామరాజు చెరువు వరకు సీసీ డ్రెయిన్ నిర్మాణం.

పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి

ప్రజా ధనంతో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)నిరంతరం సమన్వయం చేస్తున్నారు.మంజూరైన నిధులు ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే విధంగా వినియోగించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

“విజయవాడ పార్లమెంట్ అభివృద్ధే లక్ష్యం”

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ, విజయవాడ పార్లమెంట్ లోని ప్రతి ప్రాంతానికి సమాన ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రజల నుంచి వచ్చే స్థానిక సమస్యలు, అవసరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అందుబాటులో ఉన్న ఎంపీ లాడ్స్ నిధులతో సాధ్యమైనంత మేరకు అభివృద్ధి పనులను చేపడతామని ఆయన పేర్కొన్నారు.విజయవాడ పార్లమెంట్ ను మరింత అభివృద్ధి చెందిన, మెరుగైన మౌలిక వసతులు కలిగిన పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని స్పష్టం చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story