Vijayawada: కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి

Vijayawada: విజయవాడ కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం చిన్నారులు కృష్ణుడు, రాధ వేషధారణలతో పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 4 Sept 2026 5:11 PM IST
Vijayawada
X

Vijayawada: కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి

విజయవాడ: కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి - కరీర్వాక్ ఫౌండేషన్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా గోపికల వేషధారణల్లో అలరించారు. అయితే ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ముస్లిం కుటుంబాలకు చెందిన చిన్నారులు సైతం కృష్ణుడు, రాధ వేషాలు ధరించి వేడుకల్లో పాల్గొనడం.

మతాలు వేరైనా.. మనసులు ఒక్కటేనని, పండుగలు వేరైనా ఆనందం అందరిదీ ఒకటేనని ఈ చిన్నారులు చాటి చెప్పారు. ఒకరి పండుగను మరొకరు గౌరవిస్తూ, సంస్కృతులను పంచుకుంటూ, ప్రేమతో కలిసి జరుపుకోవడమే నిజమైన భారతీయత.

చిన్నారుల వేషధారణ చూసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే మత సామరస్యం, సోదరభావం, పరస్పర గౌరవం వంటి విలువలను పిల్లల్లో పెంపొందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story