Vijayawada: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలపై పోలీసుల సమీక్ష
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల భద్రతపై సీపీ ఎస్.వి. రాజశేఖర బాబు అధికారులతో సమీక్ష నిర్వహించి, సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
Vijayawada: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలపై పోలీసుల సమీక్ష
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై త్వరలో జరగనున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్. గారు
ఈ రోజు పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు టెంపుల్ ఈ.ఓ. శ్రీ శ్రీనానాయక్ గారు, పశ్చిమ డి.సి.పి. శ్రీ రామ కృష్ణ గారు, ఇతర పోలీస్ అధికారులు మరియు దేవస్థాన అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఉత్సవాల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాలపై కూలంకషంగా చర్చించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ:
"ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. వీఐపీ ప్రాధాన్యతల కంటే సామాన్య భక్తుల సౌకర్యార్థం, వారి సురక్షిత దర్శనానికే మన ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ప్రతి భక్తుడు అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకుని తిరిగి వెళ్లేలా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేయడం పై సమీక్ష నిర్వహించారు.
అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు మరియు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలపై సమీక్షించారు.
నగర సరిహద్దుల నుండి ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల వరకు సిసిటీవి కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 24 గంటలూ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేయాలని, ముఖ్యమైన ప్రదేశాల్లో కంట్రోల్ రూమ్‌లు మరియు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేసి భక్తులకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించే చర్యలు చేపట్టాలని సమీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర బాబు, ఐ.పి.ఎస్. గారు, టెంపుల్ ఈ.ఓ. శ్రీ శ్రీనానాయక్ గారు, పశ్చిమ డి.సి.పి. శ్రీ రామ కృష్ణ గారు, పశ్చిమ ఏ.సి.పి. శ్రీ ఎన్.వి.దుర్గారావు , ఇన్స్పెక్టర్ శ్రీ గుణారామ్ గారు, టెంపుల్ ఈఈ రమాదేవి అధికారులు పాల్గొన్నారు.




