Ramamohana: రామమోహన గ్రంథాలయంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం!

Ramamohana: రామమోహన గ్రంథాలయంలో గిడుగు రామమూర్తి 164వ జయంతి, తెలుగు భాషా దినోత్సవం. ముఖ్య అతిథిగా డాక్టర్ పాలపర్తి శ్యామలానందప్రసాద్.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 29 Aug 2026 1:26 PM IST
Ramamohana
X

Ramamohana: రామమోహన గ్రంథాలయంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం!

Ramamohana: తెలుగు వ్యవహారిక భాషా ఉద్యమ స్ఫూర్తి శ్రీ గిడుగు రామమూర్తి పంతులుగారి 164 జయంతి సందర్భంగా రామమోహన గ్రంథాలయంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర తెలుగు భాషా ఉద్యమ కార్యకర్త, అవధాన మార్తాండ డాక్టర్ పాలపర్తి శ్యామలానందప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని తన ప్రసంగంలో తెలుగు భాషా ప్రాముఖ్యతను, తెలుగు భాషను వాడుక భాషగా ప్రోత్సహించడానికి కృషి చేసిన గిడుగు రామమూర్తి కృషిని వివరించారు.

కార్యక్రమానికి ముందుగా గిడుగు రామమూర్తి చిత్ర పటానికి పూలమాలలువేసి ముఖ్య అతిథి శ్యామలానందు మరో విశిష్ట అతిథి అంబటి మధు మోహన్ కృష్ణ నివాళులు అర్పించారు. మధు మోహన్ కృష్ణ తన ప్రసంగంలో తెలుగు భాష పట్ల పిల్లలలో అభిమానాన్ని పెంపొందించాలని తల్లిదండ్రులకు సూచన ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి గ్రంథాలయ కమిటీ అధ్యక్షులు చింతలపూడి కోటేశ్వరరావు అధ్యక్షత వహించి స్వాగతోపన్యాసం చేశారు. కార్యదర్శి శ్రీ వేములపల్లి కేశవరావు గారి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ దమ్మాల రామచంద్రరావు గారు, కమిటీ సభ్యులు చిదంబరేశ్వరరావు, పద్మజ గార్లు గ్రంథాలయ సిబ్బంది పాఠకులు ఇతర పురప్రముఖులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story