Vijayawada: విద్యాధరపురంలో కూలిన రిటైనింగ్ వాల్.. వెలంపల్లి పరిశీలన!
Vijayawada: విజయవాడ విద్యాధరపురం 45వ డివిజన్ కొండ బడి వద్ద వర్షాలకు రిటైనింగ్ వాల్ కూలింది.
Vijayawada: విద్యాధరపురంలో కూలిన రిటైనింగ్ వాల్.. వెలంపల్లి పరిశీలన!
విజయవాడ: మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో విద్యాధరపురం 45వ డివిజన్, కొండ బడి ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో ఇటీవల కురిసినవర్షం వలన రిటైనింగ్ వాల్ నానిపోయి కూలింది. గోడ కూలడంతో మట్టి, రాళ్ళు మార్గానికి అడ్డంగా పడినాయి. సదరు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
అనంతరం మున్సిపల్ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధప్రాతిపదికన శిథిలాలను తొలగించి, పటిష్టమైన కొత్త రిటైనింగ్ వాల్‌ను తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొండ ప్రాంత ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే శాశ్వత నడక మార్గాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరడం జరిగింది.




