Vijayawada: ఇంద్రకీలాద్రిపై వినాయక ఉత్సవాల ముగింపు.. పూర్ణాహుతి పూజలు!
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా లక్ష్మీ గణపతికి పూర్ణాహుతి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Vijayawada: ఇంద్రకీలాద్రిపై వినాయక ఉత్సవాల ముగింపు.. పూర్ణాహుతి పూజలు!
విజయవాడ: ఇంద్రకీలాద్రి పై వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మి గణపతి ఆలయం లో ప్రతిష్టించిన గణపతి కి ప్రత్యేక పూజలు జరుగగా,ఈరోజు ఉదయం ఉత్సవ ముగింపు పూర్ణాహుతి ప్రత్యేక పూజలు నటరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆలయం స్థానాచార్య శ్రీ వి. శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి.
ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), ఈవో వికె శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో విగ్రహం నిమజ్జనం జరుగుతుందని వైదిక కమిటీ తెలియజేసింది.




