Vijayawada: బుద్ధా వెంకన్న కార్యాలయంలో ప్రజల సమస్యల స్వీకరణ!
Vijayawada: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో నాయకులు ప్రజల సమస్యలను స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Vijayawada: బుద్ధా వెంకన్న కార్యాలయంలో ప్రజల సమస్యల స్వీకరణ!
విజయవాడ: పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బుద్ధా వెంకన్న గారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీ చందన సురేష్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గుర్రం కొండ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను సావధానంగా విని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ బుద్ధా వెంకన్న గారి ఆదేశాల మేరకు ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రజల సమస్యలను కేవలం వినడమే కాకుండా, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పనిచేస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,బోసుబాబు, గోలి శ్రీనివాసరావు, కామాక్షి తదితరులు పాల్గొన్నారు.




