Vijayawada: లయోలా కళాశాలలో 'అస్త్రం సిటిజన్ యాప్'పై పోలీసుల అవగాహన సదస్సు!
Vijayawada: విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో విద్యార్థులకు 'అస్త్రం సిటిజన్ యాప్' మరియు రోడ్డు భద్రతా నిబంధనలపై ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
Vijayawada: లయోలా కళాశాలలో 'అస్త్రం సిటిజన్ యాప్'పై పోలీసుల అవగాహన సదస్సు!
విజయవాడ: ఈ రోజు పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారి ఆదేశాల మేరకు ఇన్ చార్జ్ ట్రాఫిక్ డి.సి.పి. శ్రీ కె.తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్.గారి పర్యవేక్షణలో ట్రాఫిక్ ఏ.సి.పి.శ్రీ వంశీధర్ గౌడ్ గారు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ రవి కుమార్ గారు, వారి సిబ్బంది మరియు అస్త్రం సిబ్బందితో కలిసి విజయవాడ లయోలా కళాశాలలో విద్యార్థులకు ‘అస్త్రం సిటిజన్ యాప్’ (Astram Citizen App) మరియు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించబడింది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా రక్షణ మెరుగుపరచడం కోసం అస్త్రం సిటిజన్ యాప్‌ను ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులుమీదుగా ప్రారంభించడం జరిగిందని, ప్రజలు మరియు ప్రయాణికుల సౌకర్యార్ధం అస్త్రం సిటిజన్ యాప్ ను రూపోందించినట్లు, ఈ యాప్ లో 13 ముఖ్యమైన ఫీచర్లు అయిన ట్రాక్ మై ఆటో (Track My Auto), బి ఏ కాప్ (Be A Cop), మై రూట్స్ (My Routes), ఈవెంట్ క్యాలెండర్ (Event Calendar), అడ్వైజరీ / న్యూస్ (Advisory & News), ఈవెంట్ పర్మిషన్ ఫారమ్ (Event Permit Form), వై ఐ యామ్ స్టక్? (Why I am Stuck?),బ్లాక్ స్పాట్ అలర్ట్స్ (Black Spot Alerts), పార్కింగ్ రిజిస్ట్రేషన్ (Register for Parking), గ్రీన్ ఛానల్ రిక్వెస్ట్ (Green Channel Request), పార్కింగ్ ప్రదేశాల వివరాలు (Parking Features) మొదలైన అంశాలతో కూడి ఉంటుందని తెలియజేస్తూ వాటి ఉపయోగాల గురించి అవగాహన కల్పించడం జరిగింది.
అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో వెంటనే స్పందించి ఆసుపత్రి లో జాయిన్ చేస్తే వారికి రహావీర్ పధకం కింద 25 వేల రూపాయలు పారితోషికం అందిస్తారని మరియు బాధితులకు పి.ఎం.రాహత్ పథకం క్రింద లక్షా యాభై వేల రూపాయలు వరకు కాష్ లేష్ ట్రీట్మెంట్ ఇస్తారని, దీనిని అందరూ వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు యాప్ వినియోగం, రోడ్డు భద్రతపై పోలీస్ ఖాకి సూడియో ద్వారా అవగాహన కల్పించడానికి తయారు చేసిన వీడియోలను చూపిస్తూ దిశానిర్దేశం చేశారు.




