Vijayawada: విజయవాడ నాగార్జున హాస్పిటల్‌లో అరుదైన వైద్య విజయం!
Vijayawada: విజయవాడ నాగార్జున హాస్పిటల్‌లో రెండేళ్ల బాలుడికి న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్‌కు సంబంధించి స్టెమ్ సెల్ సేకరణ (అఫెరెసిస్) ప్రక్రియ విజయవంతం.
Vijayawada: విజయవాడ నాగార్జున హాస్పిటల్‌లో అరుదైన వైద్య విజయం!
Vijayawada: న్యూరోబ్లాస్టోమా (నాడీ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్)తో బాధపడుతున్న రెండేళ్ల బాలుడికి నాగార్జున హాస్పిటల్‌లో స్టెమ్ సెల్ సేకరణ (అఫెరెసిస్) ప్రక్రియను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. కానూరులోని నాగార్జున హాస్పిటల్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో అత్యాధునిక 'స్పెక్ట్రా ఆప్టియా అఫెరెసిస్ సిస్టమ్' (Spectra Optia Apheresis System) ద్వారా ఈ సంక్లిష్టమైన చికిత్సను పూర్తి చేసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
గరికిన జితేంద్ర అనే రెండేళ్ల బాలుడి వయస్సు, శరీర బరువును దృష్టిలో ఉంచుకుని వైద్యులు ముందుగా రక్త పరీక్షలు, CD34+ కౌంట్, వైటల్ పారామీటర్లను సమగ్రంగా పరిశీలించారు. చికిత్స సమయంలో చిన్నారి రక్తపోటు, పల్స్, ఆక్సిజన్ స్థాయులు మరియు ఉష్ణోగ్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత CD34+ స్టెమ్ సెల్ లక్ష్యాన్ని సురక్షితంగా చేరుకున్నారు. సేకరించిన స్టెమ్ సెల్స్‌ను అనంతరం అవసరమైన నాణ్యతా పరీక్షలకు పంపించారు.
ఈ సందర్భంగా నాగార్జున హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) శ్రీ ధనిష్ట బత్తుల మాట్లాడుతూ... "ఇంతటి చిన్న వయసు ఉన్న బాలుడికి అఫెరెసిస్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం మా వైద్య బృందానికి, బ్లడ్ సెంటర్ సిబ్బందికి గర్వకారణం. రోగి భద్రతకే మా మొదటి ప్రాధాన్యం. అత్యాధునిక సాంకేతికతతో కూడిన నాణ్యమైన వైద్య సేవలను స్థానికంగానే రోగులకు అందించేందుకు నాగార్జున హాస్పిటల్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది" అని తెలిపారు.




