Vijayawada: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సేవలో యార్లగడ్డ దంపతులు!

Vijayawada: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 28 Aug 2026 2:54 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సేవలో యార్లగడ్డ దంపతులు!

Vijayawada: ఇంద్రకీలాద్రి పై కొలువుదీరిన కనకదుర్గమ్మను ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఆయన సతీమణి జ్ఞానేశ్వరి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న దంపతులకు దేవస్థాన అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజల అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా కనకదుర్గమ్మ కృపాకటాక్షాలతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సుభిక్షం కలగాలని యార్లగడ్డ వెంకట్రావు ఆకాంక్షించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story