Vijayawada: 'పాపులర్ షూ మార్ట్' అధినేత విజయ్ కుమార్ మృతి.. సుజనా చౌదరి సంతాపం!
Vijayawada: విజయవాడ ప్రముఖ వ్యాపారవేత్త, పాపులర్ షూ మార్ట్ అధినేత చుక్కపల్లి విజయ్ కుమార్ మృతి పట్ల ఎమ్మెల్యే సుజనా చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Vijayawada: ప్రముఖ వ్యాపారవేత్త చుక్కపల్లి విజయ్ కుమార్ కన్నుమూత!
Vijayawada: విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, పాపులర్ షూ మార్ట్ అధినేత చుక్కపల్లి విజయ్ కుమార్ ఆకస్మిక మరణం పట్ల మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్ కుమార్ మరణం వ్యాపార రంగానికే కాకుండా సామాజిక సేవా రంగానికీ తీరని లోటని పేర్కొన్నారు.
చుక్కపల్లి విజయ్ కుమార్ వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించిన వ్యక్తిగా మంచి గుర్తింపు పొందారని సుజనా చౌదరి తెలిపారు. కష్టపడి ఎదిగి, ఎందరో యువ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అంకితభావం, నిజాయితీ, సేవా దృక్పథంతో ఆయన సాగించిన ప్రయాణం అనేక మందికి స్ఫూర్తినిచ్చిందన్నారు.
వ్యాపారాభివృద్ధితో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొనడం ద్వారా ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. ఆయన ఆకస్మిక మరణ వార్త ఎంతో బాధాకరమని, ఈ లోటును భర్తీ చేయడం కష్టమని అన్నారు.
చుక్కపల్లి విజయ్ కుమార్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.




