Vijayawada: క్రీడాకారులు సత్తా చాటాలి మంత్రి మండిపల్లి!

Vijayawada: విజయవాడలో జరిగిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ సెలెక్షన్ ట్రయల్స్‌లో క్రీడాకారులు ప్రతిభ చాటి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Aug 2026 7:28 AM IST
Vijayawada
X

Vijayawada: క్రీడాకారులు సత్తా చాటాలి మంత్రి మండిపల్లి!

Vijayawada: ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్‌ లో సత్తా చాటి ఉన్నత స్థాయికి చేరుకోవాలి....మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

కార్యక్రమంలో పాల్గొన్న పెనమలూరు టీడీపీ నాయకులు వెంకట, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణ, బ్లాక్ బాక్స్ వ్యవస్థాపకులు అభిషేక్ రెడ్డి గారు, టెక్నికల్ ఆర్గనైజర్ తులసి రెడ్డి గారు, సిద్ధార్థ కాలేజ్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ సెలెక్షన్ ట్రయల్స్‌ను విజయవాడలోని విఆర్ సిద్ధార్థ కాలేజీ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-21 & ఓపెన్ వాలీబాల్ ట్రయల్స్ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ట్రయల్స్‌కు వచ్చిన క్రీడాకారులకు స్వాగతం పలికారు.

ట్రయల్స్‌లో ప్రతిభ కనబర్చి ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ఆడే అవకాశాన్ని ప్రతి క్రీడాకారుడు అందిపుచ్చుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ బాక్స్ వ్యవస్థాపకులు అభిషేక్ రెడ్డి గారు, టెక్నికల్ ఆర్గనైజర్ తులసి రెడ్డి గారు, సిద్ధార్థ కాలేజ్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్, క్రీడాకారులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story