Vijayawada: ఏలూరు డీఆర్‌ఓ మర్రి శ్రీదేవి వేధింపులపై విచారణ జరపాలి!

Vijayawada: ఏలూరు డీఆర్‌ఓ మర్రి శ్రీదేవిపై వేధింపులను అరికట్టి ఉన్నత స్థాయి విచారణ జరపాలని విజయవాడలో కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 7 Sept 2026 4:18 PM IST
Vijayawada
X

Vijayawada: ఏలూరు డీఆర్‌ఓ మర్రి శ్రీదేవి వేధింపులపై విచారణ జరపాలి!

Vijayawada: భాధ్యతలు నిర్వర్తించే విధంగా ప్రభుత్వం అదేశాలువ్వాలని రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్దన్ డిమాండ్ చేసారు. సోమవారం విజయవాడ లొ ఆయన విడుదల చేసిన ప్రకటన లో దామాషా ప్రకారం 25 శాతం ఉన్న కాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు కాపు మున్నూరుకాపు ఉద్యోగులకు వేధింపులు లేకుండా తమ విధులు కొనసాగే విధం గా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చందు జనార్దన్ డిమాండ్ చేశారు.

ఏలూరు జిల్లా డి ఆర్ ఓ మర్రి శ్రీదేవి గారి పట్ల ఉన్నతాధికారి దురుసుగా ప్రవర్తించడం దుర్భాష లాడటం పట్ల ఆంధ్రజ్యోతి లో వచ్చిన కథనం లో చాలా ఆవేదనతో కూడిన కథనం రావడం,గౌరవ కుటుంబ సభ్యురాలు డిఆర్ ఓ మర్రి శ్రీదేవి గారు సెలవు పై వెళ్లడం పట్ల రాష్ట్ర కాపు జే ఏ సీ తీవ్రం గా ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని,డీఆర్ ఓ గారి విధులు నిర్వర్తించే విధంగా శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ సంఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు,చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారి దృష్టికి మంత్రి అనగాని సత్య ప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు జనార్ధన్ తెలిపారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story