Meghna: మోసపోయి అడుగుపెట్టా.. జోగి రమేష్ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు
Meghna: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన తీవ్ర ఆరోపణలు చేశారు.
Meghna: మోసపోయి అడుగుపెట్టా.. జోగి రమేష్ కుటుంబంపై కోడలు మేఘన సంచలన ఆరోపణలు
Meghna: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై ఆయన కోడలు మేఘన తీవ్రమైన ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చారు. తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె, తన జీవితాన్ని నాశనం చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
2025 మే నెలలో జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌తో తనకు వివాహం జరిగిందని మేఘన తెలిపారు. పెళ్లి సమయంలో తమది హిందూ కుటుంబమని చెప్పిన జోగి రమేష్ కుటుంబ సభ్యులు, ఇంట్లో ఏ ఒక్క హిందూ దేవుడి పటం కూడా లేకుండా క్రిస్టియన్ పద్ధతులు పాటించేవారని ఆరోపించారు. తాను దేవుడి ఫోటోలు పెట్టి పూజలు చేస్తుంటే అడ్డుకుని, హారతి, అగరబత్తులను లాగి పడేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, భర్త రాజీవ్‌కు ఉన్న లోపాలు కుటుంబం అంతటికీ తెలిసినా ఆ విషయాన్ని దాచిపెట్టి తన గొంతు కోశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమస్యను పరిష్కరించాల్సింది పోయి, "అదనపు కట్నం తీసుకువస్తేనే నీ భర్తకు ఫీలింగ్స్ వస్తాయి" అంటూ అత్త శకుంతల తీవ్రంగా వేధించిందని ఆరోపించారు. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉందంటూ తమను బెదిరించారని పేర్కొన్నారు.
తాను న్యాయం కోసమే ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను కలిశానని, దీనిపై జోగి రమేష్ రాజకీయాలు చేస్తూ సింపథీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని మేఘన మండిపడ్డారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్ని వాస్తవాలు వివరించానని, తన వద్ద ఉన్న మరిన్ని ఆధారాలను త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు.




