Vijayawada: విజయవాడలో యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా.. అధికారుల నిఘా ఏది?

Vijayawada: నగరంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొని రీసైక్లింగ్ చేస్తున్న ముఠాలపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్.

Ramana, Penamaluru
Published on: 2 Sept 2026 10:12 PM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడలో యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా.. అధికారుల నిఘా ఏది?

విజయవాడ: పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోందా? విజయవాడ నగరం, పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమ సేకరణ, నిల్వలు, రవాణాపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులకు చేరాల్సిన బియ్యం కొందరు మధ్యవర్తులు, అక్రమ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చౌకగా సేకరణ.. బయట మార్కెట్‌లో విక్రయం?

రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు సేకరించి, పెద్ద మొత్తాల్లో నిల్వ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఇంత పెద్ద మొత్తంలో బియ్యం తరలిపోతుంటే సంబంధిత శాఖల నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి.

రాత్రివేళల్లో వాహనాల కదలికలపై అనుమానాలు

కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బియ్యం బస్తాలతో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వాహనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బియ్యం ఎక్కడికి తరలుతోంది? గోదాముల్లో ఎంత మొత్తంలో నిల్వ ఉంది? అనే అంశాలపై అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.

పేదల హక్కుపై అక్రమార్కుల వ్యాపారమా?

ప్రభుత్వం పేదల కోసం కేటాయించే బియ్యం అక్రమ వ్యాపారానికి ఉపయోగపడితే, దాని ప్రభావం నేరుగా పేద కుటుంబాలపై పడుతుంది. అందుకే కేవలం చిన్నస్థాయి తనిఖీలతో సరిపెట్టకుండా.. సరఫరా గొలుసులోని ప్రతి దశను అధికారులు పరిశీలించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

అసలు దందా వెనుక ఉన్నది ఎవరు, బియ్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఎక్కడికి వెళ్తోంది, అధికారుల దర్యాప్తులో నిజాలు బయటపడతాయా,

రేషన్ బియ్యం అక్రమ రవాణాపై వస్తున్న ఆరోపణలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరాధార ఆరోపణలైతే వాటిపైనా స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story