Vijayawada: కనకదుర్గమ్మకు రూ.11 లక్షల బంగారు జడ కానుక!
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు రూ.11 లక్షల విలువైన బంగారు జడను కానుకగా సమర్పించిన దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ.
Vijayawada: కనకదుర్గమ్మకు రూ.11 లక్షల బంగారు జడ కానుక!
Vijayawada: ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న దుర్గగుడి పాలక మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) గారు అమ్మవారి అలంకరణ కోసం ప్రత్యేకంగా ఒక బంగారు జడను తయారు చేయించారు. రూ. 11 లక్షల వ్యయంతో రూపొందించిన ఈ సుందరమైన బంగారు జడను ఆదివారం ఉదయం ఆలయ ఆలయ ఈవో వి కే శీనా నాయక్ గారికి అర్చకులకు అందజేశారు.
ఈ విశేష కానుక సమర్పణకు
భారీ విరాళం: అమ్మవారి అలంకరణ కొరకు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గారి కుటుంబం తరపున చేయించారు
ఆలయ మర్యాదలు: తో ఆదివారం ఉదయం 9.30 గంటలకు రాజగోపురం ప్రాంగణంలోని కళా వేదిక వద్ద ఆలయ మర్యాదలతో ఈ కార్యక్రమం జరిగింది. మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి ఈ స్వర్ణ ఆభరణాన్ని అర్చకులకు అందజేసినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
ఆలయ రాధాకృష్ణ గాంధీ చైర్మన్ గారి కుటుంబ సభ్యులు, కార్యనిర్వాహణాధికారి మరియు ఆలయ సిబ్బంది మరియు అర్చక స్వాములు అందరూ కలిసి ఈ బంగారు జడను ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారి ప్రధాన ఆలయానికి తీసుకువెళ్లారు.
ఆ ఆభరణం యొక్క మొత్తం విలువ రూ. 11 లక్షలు ఆభరణం సుమారు 130 గ్రాముల నుండి 160 గ్రాముల (సుమారు 13 నుండి 16 తులాలు) మధ్య నికర బంగారు బరువుఆభరణం/డిజైన్: సాంప్రదాయ పద్ధతిలో, ఎంతో నైపుణ్యంతో రూపుదిద్దుకున్న లక్ష్మీదేవి మరియు ఇతర దైవిక రూపాలు కలిగిన బంగారు జడ. దీనికి కింద ఆకుపచ్చ రంగు విలువైన రాళ్లు, ముత్యాలు పొదిగి ఉన్నాయి.




