Vijayawada: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పరిధిలో డాక్టర్ అపర్ణకు పురస్కారం!
Vijayawada: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ సి. అపర్ణను డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ అధికారుల సత్కారం.
Vijayawada: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పరిధిలో డాక్టర్ అపర్ణకు పురస్కారం!
Vijayawada: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం–2026కు ఎంపికైన ప్రభుత్వ వైద్య కళాశాల, గుంటూరుకు చెందిన *ప్రొఫెసర్ డా. సి. అపర్ణ, ఎం.డి. (పాథాలజీ)*ను డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో గురువారం ఘనంగా సత్కరించారు.
విశ్వవిద్యాలయ పరిధిలోని వైద్య కళాశాలల నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డా. సి. అపర్ణ గారికి లభించింది. వైద్య విద్యారంగంలో ఆమె అందిస్తున్న సేవలు, విద్యా ప్రమాణాల పెంపునకు చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆమెను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక చేశారు.
గురుపూజోత్సవం–2026 సందర్భంగా సెప్టెంబరు 5న అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా డా. సి. అపర్ణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ పులాల చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డా. టి. సాయి సుధీర్ డా. సి. అపర్ణను అభినందించి, విశ్వవిద్యాలయం తరఫున ఘనంగా సత్కరించారు. ఈ పురస్కారం డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి, దాని అనుబంధ వైద్య కళాశాలలకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.




