Vijayawada: బుడమేరు ముంపు: రెండేళ్లయినా పట్టించుకోని సర్కార్!

Vijayawada: బుడమేరు ముంపు వచ్చి రెండేళ్లు అవుతున్నా శాశ్వత చర్యలు చేపట్టని కూటమి ప్రభుత్వంపై సీపీఎం ఆగ్రహం. రూ.5222 కోట్ల నిధులు విడుదల చేయాలని కోరుతూ ధర్నా.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 2 Sept 2026 6:42 AM IST
Vijayawada
X

Vijayawada: బుడమేరు ముంపు: రెండేళ్లయినా పట్టించుకోని సర్కార్!

Vijayawada: బుడమేరు ముంపు వచ్చి రెండేళ్లయినా.. ముంపు నివారణ శాశ్వత చర్యల్లో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం మళ్లీ పొంచి ఉన్న బుడమేరు ముంపు ప్రమాదం, ఆందోళనలో జనం అమరావతిలో ముంపు నివారణ చర్యలు యుద్ధ ప్రాతిపదికపై చేస్తున్న సర్కార్... బుడమేరు ముంపు నివారణ చర్యలను ఎందుకు గాలికి వదిలేసింది?

5222 కోట్లతో రూపొందించిన బుడమేరు నివేదికను బుట్ట దాఖలు చేసిన కూటమి స్వప్రయోజనాలే తప్ప, బుడమేరు ముంపు నివారణను పట్టించుకోని విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులు ముంపుకు రెండేళ్లయిన సందర్భంగా... బుడమేరు ముంపు నివారణ శాశ్వత చర్యలు చేపట్టాలని, నిధులు విడుదల చేయాలని కోరుతూ.. సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా, నిరసన

ధర్నాలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్ తదితరులు నేడు విజయవాడలో బుడమేరు వంతెన వద్ద.. అల్లూరి సీతారామరాజు విగ్రహం సమీపంలో.. బుడమేరు ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, నిధులు విడుదల చేయాలని కోరుతూ సిపిఎం విజయవాడ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు

ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిపిఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, బ్యానర్లు చేపట్టి ఆందోళన జరిపారు స్థానికులు ఆందోళనకు మద్దతు పలికారు ధర్నాను ఉద్దేశించి బాబురావు మాట్లాడుతూ.

రెండు సంవత్సరాల క్రితం 2024 ఆగస్టు 31 వ తేదీ అర్ధరాత్రి సెప్టెంబర్ ఒకటవ తేదీన బుడమేరు వరద ముంచెత్తింది విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలో 50 మంది మృతి చెందారు, 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు, లక్షకు పైగా కుటుంబాలు ముంపుతో సర్వస్వం కోల్పోయారు

పంట పొలాలు నాశనమయ్యాయి, ఇళ్ళు దెబ్బతిన్నాయి, వేలాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది ముందస్తు హెచ్చరికలు చేయటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది వారం.. పది రోజులు పాటు జనం నీట మునిగే ఉన్నారు

లక్షల మంది జనం నానా అవస్థలు పడ్డారు, కనీసం వారిని బయటికి తేవడానికి పడవలు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం చేతులెత్తేసింది ప్రజలు,సంస్థలు 600 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వానికి విరాళాలు అందించారు

ప్రభుత్వం అరకొర సహాయం చేసి చేతులు దులుపుకున్నది, ఆహారం, మంచినీరు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పేరిట వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది, అనేక ఆరోపణలు వచ్చినా, కనీసం విచారణ కూడా జరపలేదు

వారం రోజులపాటు హడావిడి చేసిన ప్రభుత్వం, ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యింది ముంపు నివారణకు శాశ్వత చర్యలు తక్షణమే చేపడతామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కాగితాలకే మిగిలింది

6800 కోట్ల రూ.. నష్టం వాటిల్లినదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వమే నివేదిక పంపింది.. కేంద్రం అప్పటి నుండి ఒక నయా పైసా విడుదల చేయలేదు డబుల్ ఇంజన్ సర్కార్ గా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వం.. కేంద్రం నుండి నిధులు తెచ్చి, ముంపు నివారణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది

వికసిత్ ఆంధ్ర ప్రదేశ్, విజన్ 2047 గురించి రోజూ వల్లించే ముఖ్యమంత్రి, కూటమి ముంపు నివారణ చర్యలను విస్మరించడం తగదు ముంపు నివారణ శాశ్వత చర్యల కొరకు అధికారులు 5222 కోట్ల రూ. అంచనాలతో రూపొందించిన డిపిఆర్ ను ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు ఆమోదించలేదు? నిధులు ఎందుకు విడుదల చేయలేదు? నివేదికను బుట్ట దాఖలు చేయటం శోచనీయం

అరకొరగా గండ్లు పూడ్చడం, రెగ్యులేటర్లకు చిన్నచిన్న రిపేర్లు, డైవర్షన్ ఛానల్ కొద్దిపాటి పనులు, ఎనికెపాడు అండర్ టన్నల్ పనులు అరకొరగా చేయటం మినహా... శాశ్వత చర్యలు ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది

కొల్లేరు వరకు 50 కిలోమీటర్ల పొడవునా బుడమేరును లోతు, వెడల్పు చేయటం.. విజయవాడ సమీపంలో 25 కిలోమీటర్ల పొడవున సమాంతర కాలువ తవ్వటం... రిటైనింగ్ వాల్ నిర్మాణం... కృష్ణా నదిలోకి బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యం 37,500 క్యూసెక్కులకు పెంచడం..

వెలగలేరు రెగ్యులేటర్ సామర్థ్యం పెంచటం... ఎగువున నాలుగు రిజర్వాయర్ల నిర్మాణం.. తదితర శాశ్వత చర్యలపై అధికారులు, వివిధ కమిటీలు ఇచ్చిన నివేదికలపై కూటమి ప్రభుత్వం కనీసమైన దృష్టి పెట్టకపోవడం గర్హనీయం

గత వైసిపి ప్రభుత్వం 500 కోట్ల రూ.. నిధులతో బుడమేరు ముంపు నివారణ చర్యలు అంటూ మాటలతో కాలం వెళ్ళబుచ్చింది కూటమి సర్కార్ ఈవెంట్ మేనేజ్మెంట్ లు, ప్రచార ఆర్భాటంపై దృష్టి పెట్టి.. ప్రజలను కాపాడే శాశ్వత చర్యలను గాలికి వదిలేసింది

ఆపరేషన్ బుడమేరు అంటూ మాటలే తప్ప చేతలు లేవు చిన్న వర్షం పడినా.. బుడమేరు పరివాహక ప్రాంతంలోని ప్రజలు బిగ్గుబిక్కుమంటూ వరద ముంపు భయంతో భయాందోళన చెందుతున్నారు పలుసార్లు వరద భయంతో జనం సామాన్లు సర్దుకున్నారు, వాహనాలను బయట ప్రాంతాలకు తరలించారు, పిల్లలను.. బంధువుల ఇళ్లకు తీసుకొని వెళ్ళిపోయారు, ప్రజలకు భరోసా ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది

అమరావతిలో రాబోయే 25, 50 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని కొండవీటి వాగు ముంపు నుండి రక్షించడానికి ఆగమేఘాలపై రిజర్వాయర్లు తవ్వారు, కాలువలు తవ్వుతున్నారు, వేలాది కోట్లు ఖర్చుపెట్టి శాశ్వత చర్యలు తీసుకుంటున్నారు

లక్షలాదిమంది ప్రాణాలకు ముప్పుగా తయారైన బుడమేరు ముంపు నివారణకు చర్యలు... విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణ జిల్లాల ప్రజలను కాపాడటంపై ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టదు?

అమరావతి తోపాటు విజయవాడ, గుంటూరు నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తామని.. రాజధాని లో భాగంగా చూస్తామని ముఖ్యమంత్రి ప్రకటనలు చేయటమే తప్ప.. బుడమేరు ముంపు నివారణ చర్యలకు నిధులు కేటాయింపు లేదు, శ్రద్ధ పెట్టడం లేదు

విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణ జిల్లా ప్రజలపై కూటమి ప్రభుత్వం ఎందుకు చిన్న చూపు చూస్తోంది? ఎందుకు వివక్షత ప్రదర్శిస్తున్నది? విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలలోని కూటమి ప్రజాప్రతినిధులు.. అనేకమంది నాడు కనీసం వరద సమయంలో నీటిలో కాలు పెట్టలేదు..నాడు ప్రజలకు మొహం చాటేసారు.. ప్రచార ఆర్భాటం మాత్రం చేశారు

కనీసం ఈ రెండేళ్లలోనైనా స్థానిక ప్రజా ప్రతినిధులు బుడమేరు ముంపు నివారణ చర్యలకు నిధులు సాధించడానికి ప్రభుత్వం పై ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమయ్యారు సొంత సంపాదనే తప్ప.. ఈ ప్రాంత అభివృద్ధిని వీరు పూర్తిగా విస్మరించారు, అసమర్ధులుగా మిగిలిపోయారు

రాబోయే నగరపాలక సంస్థ, స్థానిక ఎన్నికలలో తమ కుటుంబ సభ్యులకు పదవులు దక్కించుకోవడానికి ఈ నేతలు ఆరాటపడుతున్నారు, ప్రజల ప్రాణాలను మాత్రం గాలికి వదిలేశారు కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు బుడమేరు ముంపు నివారణ చర్యల పట్ల నేరపూరిత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు

నగరంలో జిల్లాలో పలుచోట్ల వరదలలో దెబ్బతిన్న రోడ్లు, డ్రైన్లు, చప్టాలు, వంతెనలు, కల్వర్టులు, చెరువు కట్టలకు .. నేటికీ.. వాటికి రిపేర్లు కూడా చేయించకపోవడం అమానుషం సిపిఎం వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచింది, తన శక్తి మేరకు 15 కేంద్రాల్లో లక్ష 75 వేల మందికి భోజన ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకున్నది, కార్యకర్తలు వరదల సమయంలో అండగా నిలిచి ప్రజలను రక్షించారు

అప్పటినుండి వరద శాశ్వత చర్యలు చేపట్టాలని పలు ఆందోళనలు నిర్వహిస్తున్నది ప్రభుత్వం ప్రజల గోడు పట్టించుకోవటం లేదు బుడమేరు ముంపు ప్రమాదంతో.. విజయవాడ పరిసర ప్రాంతాల అభివృద్ధి ముందుకు సాగటం లేదు, అవరోధంగా మారింది

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి తక్షణమే ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి.. బుడమేరు ముంపు నివారణ చర్యలను సమీక్షించాలి, అధికారులు రూపొందించిన నివేదికను ఆమోదించాలి, తక్షణం డిపిఆర్ కు అనుగుణంగా 5222 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలి

సిపిఎం ప్రజల ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తన పోరాటం కొనసాగిస్తుంది, ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి, ప్రజాప్రతినిధులను నిలదీయాలి ముంపు నివారణ చర్యలు చేపట్టడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.. పాలకుల దయాదాక్షిణ్యము కాదు..

తమ బాధ్యతగా కనుగుణంగా పాలకులు చర్యలు తీసుకోవాలి, నిధులు కేటాయించాలి నేడు జరిగిన ఈ ఆందోళనలో సిపిఎం నేతలు బి. రమణ రావు, కే. దుర్గారావు, టీ.ప్రవీణ్, సిహెచ్.శ్రీనివాస్, పీరు సాహెబ్, వై.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story