Vijayawada: జక్కంపూడి టిడ్కో ఇళ్ల వద్ద లబ్ధిదారులతో సీపీఎం భారీ నిరసన!
Vijayawada: విజయవాడ జక్కంపూడి టిడ్కో గృహాల సముదాయాన్ని పరిశీలించిన సీపీఎం నేత బాబూరావు మౌలిక సదుపాయాలు కల్పించాలని నిరసన
Vijayawada: జక్కంపూడి టిడ్కో ఇళ్ల వద్ద లబ్ధిదారులతో సీపీఎం భారీ నిరసన!
Vijayawada: టిడ్కో గృహాలపై ప్రజలను దగా చేసిన పాలకులు 8 ఏళ్లు గడిచినా.. లబ్ధిదారులు నివాసానికి నోచుకోని దుస్థితి. అద్దెలు, వడ్డీలు రూపంలో ఒక్కొక్క లబ్ధిదారుడిపై 9 లక్షల రూ.. భారం, జక్కంపూడి టిడ్కో కాలనీలో కాగితాల పైనే కేటాయింపులు, ఒక్కరు కూడా నివాసం ఉండలేని స్థితి.
తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలి, రుణబకాయలు రద్దు చేయాలి జక్కంపూడి టిడ్కో కాలనీ సందర్శించి, నిరసన తెలిపిన సిపిఎం నేతలు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు తదితరులు.
నేడు బాబురావు, సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు, సెంట్రల్ కార్యదర్శి బి. రమణ రావు తదితర సిపిఎం నేతల బృందం, లబ్ధిదారులతో కలిసి జక్కంపూడి లోని టిడ్కో గృహ సముదాయాన్ని పరిశీలించారు.
ఒక్కరంటే ఒక్కరు కూడా నివాసము ఉండలేని దుస్థితి నెలకొని ఉన్నది. మౌలిక సదుపాయాలైన మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు తదితరములు అసంపూర్తిగా ఉన్నాయి. భవన నిర్మాణాల్లోనూ ఇంకా పనులు మిగిలే ఉన్నాయి.
లబ్ధిదారుల తో కలిసి సిపిఎం నేతలు పాలకుల వైఫల్యం పై నిరసన తెలిపారు, తక్షణమే ఇళ్లు కేటాయించాలని, మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని, రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు, 8 ఏళ్ల క్రితమే లక్ష రూపాయలు డిపాజిట్ కట్టినా, ఇప్పటికీ ఇళ్ళు ఇవ్వకపోవడంతో అద్దెలు, బ్యాంకు వడ్డీల భారం పెరిగిపోయిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు 52 సంవత్సరాల వయసులో ఇళ్ల కొరకు డిపాజిట్ చెల్లించామని, నేడు 60 సంవత్సరాలు దాటాయనే సాకుతో బ్యాంకులో రుణం మంజూరు చేయటం లేదని, ఇల్లు కేటాయించడం లేదని మహిళ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాబురావు, సత్యబాబు, రమణ మాట్లాడుతూ, టిడ్కో గృహ సముదాయాలు పాలకుల నిర్లక్ష్యానికి, అసమర్థతకు అడ్డం పడుతున్నాయి. పేదల గృహ నిర్మాణాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతో పేదలు బలి అవుతున్నారు, 8 సంవత్సరాల క్రితం నాటి తెలుగుదేశం ప్రభుత్వం 7 లక్షలku పైగా టిడ్కో గృహాలు ఇస్తామని ప్రకటించి, దాదాపు 5 లక్షల ఇళ్ళు రద్దు చేశారు.
రెండు లక్షల అరవై వేల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పి, అత్యధిక భాగం ఇంకా లబ్ధిదారులకు కేటాయించకపోవడం సిగ్గుచేటు, విజయవాడలో 12 వేల టిడ్కో గృహాలు మంజూరు చేసి, 6500 మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారు, 8 ఏళ్ల అనంతరం 2200 గృహాలు కేటాయించినట్లు ప్రకటించారు.
అయినా ఒక్కరంటే ఒక్కరు నివాసం ఉండలేని దుస్థితి నెలకొన్నది, మౌలిక సదుపాయాలు పూర్తి కాలేదు, రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, రవాణా తదితర సదుపాయాలు ఇంకా పూర్తి కాలేదు, గత వైసిపి ప్రభుత్వం రాజకీయ దృష్టితో గృహాలు పూర్తి చేయటంపై దృష్టి పెట్టలేదు, మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా, హామీను పూర్తిగా అమలు చేయడం లేదు.
ముఖ్యమంత్రి గారి స్వగృహం, మంత్రులు, శాసనసభ్యుల క్వార్టర్లు యుద్ధ ప్రాతిపదిపై పూర్తి చేశారు, పేదల కొరకు కేటాయించిన ఇళ్లను 8 ఏళ్లయినా పూర్తి చేయకపోవడం శోచనీయం,ప్రైవేట్ రియల్ ఎస్టేట్ బిల్డర్ల తరహాలో ప్రభుత్వమే డిపాజిట్లు వసూలు చేసి పేదలను మోసగించడం అమానుషం.ఎప్పటికప్పుడు తేదీలు ప్రకటించడం మినహా.. గృహాలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
అంచనాలను పెంచి బడా కంపెనీలకు మేలు చేసి, పేదలపై డిపాజిట్లు రుణ భారాన్ని పాలకులు మోపారు, లబ్ధిదారులు 50 వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు డిపాజిట్లు చెల్లించి 8 ఏళ్లు గడిచాయి, బ్యాంకులు రుణాలు మంజూరు చేశారు, ఇళ్లు పూర్తి చేయకముందే వడ్డీలతో సహా బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇస్తూ లబ్ధిదారులు భయభ్రాంతులను చేస్తున్నారు, నెలకు 5000 రూపాయలు చొప్పున 96 నెలల్లో 4,80,00 రూ.. అద్దె భారం లబ్ధిదారులపై పడింది.
డిపాజిట్లపై రెండు లక్షల రూ.. వడ్డీ భారం, బ్యాంకు అప్పులపై మరో రెండు లక్షల రూపాయలు వడ్డీ.. మొత్తం కలిపి దాదాపు ఒక్కొక్క లబ్ధిదారుడి పై 9 లక్షల రూ.. అద్దెలు, వడ్డీ భారం పడింది, నిర్మాణ జాప్యం వలన పడిన ఈ భారానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి,పేదలను బలి చేయటం తగదు, బడా కంపెనీలకు అసలు, వడ్డీతో సహా రద్దుచేసి సెటిల్మెంట్ చేస్తున్న ప్రభుత్వం.. పేదల నుండి వడ్డీలతో సహా గుంజటం అన్యాయం.
జాప్యం వలన జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించి టిడ్కో గృహాలపై ఉన్న రుణాలను పూర్తిగా మాఫీ చేయాలి, తక్షణమే మౌలిక సదుపాయాలను, గృహ నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయించాలి, నివాసయోగ్యంగా మార్చాలి, రద్దు చేసిన టిడ్కో గృహాలకు నిధులు మంజూరు చేసి మిగిలిన 5500 ఇళ్లను కూడా నిర్మించాలి.
ప్రభుత్వం స్పందించకపోతే లబ్ధిదారులే తమ గృహాలను స్వాధీనం చేసుకుంటారు, గృహప్రవేశాలు చేస్తారు, సదుపాయాలు కోసం ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తారు, సిపిఎం లబ్ధిదారులకు అండగా నిలబడుతుంది, పోరాడుతుంది, నేడు జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఇవి. నారాయణ, సూరిబాబు, సిహెచ్. శ్రీనివాస్, సుబ్బారెడ్డి, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.




