Vijayawada: విజయవాడలో పాల ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఎం నిరసన!
Vijayawada: విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో పాల ధరలు, నిత్యవసర వస్తువుల పెరుగుదలకు వ్యతిరేకంగా ధర్నా కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ఫైర్.
Vijayawada: విజయవాడలో పాల ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఎం నిరసన!
Vijayawada: విజయ డైరీని తమ గుప్పెట్లోకి తీసుకొని, పాల ధరలు పెంచి,తమ జేబులు నింపుకోవటానికి కుట్ర పన్నిన ప్రభుత్వ పెద్దలు. డైరీకి చైర్మన్ లేకుండానే పాల ధరలు పెంచడం దుర్మార్గం, దీనికి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి.
గత చైర్మన్ ని బలవంతంగా రాజీనామా చేయించిన మంత్రులు... పాలధర పెంపుపై ఎందుకు స్పందించరు? హెరిటేజ్, ప్రైవేటు డైరీలు.. పాల ధరలు పెంచి.. ప్రజలను కొల్లగొట్టడానికి దారి చూపించిన కూటమి సర్కార్.
బియ్యం, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించకపోగా.. పండగ రోజునే పాల ధరలు పెంచడం సిగ్గుచేటు, పాలధర పెంపుపై నోరు మెదిపే ధైర్యం లేని, చేతగాని పార్లమెంటు, శాసనసభ సభ్యులు.
కూటమి పార్టీలు కార్పొరేటర్ సీట్లు పంచుకోవడం, అవినీతిలో వాటాలు వేసుకోవడం కాదు. ధరల పాపానికి బాధ్యత వహించాలి. ధరలు పెంచినా స్థానిక ఎన్నికల్లో జనం ఓట్లు వేస్తారనే కూటమి నేతల అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పాలి.
పాల ధరల పెంపు, నిత్యవసర వస్తువుల ధరల భారాలకు వ్యతిరేకంగా, విజయవాడ, కృష్ణలంకలో సిపిఎం నిరసన, ధర్నా, పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు.
పెంచిన పాల ధరలు తగ్గించాలని, నిత్యవసర వస్తువుల ధరలు అరికట్టాలని, రేషన్ డిపోల ద్వారా సరసమైన ధరలకు అన్ని రకాల సరుకులు అందించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ కృష్ణలంక , భ్రమరాంబపురంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నా జరిగింది.
సిపిఎం కార్యకర్తలు, స్థానికులు పాల ప్యాకెట్లను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు, పెరిగిన ధరలకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ బియ్యం మొదలు అన్ని నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలు సతమతమవుతుండగా, దానిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి టిడిపి కార్యకర్తల ఆదాయం పెంపు గురించి మాట్లాడటం సిగ్గుచేటు.
కలెక్టర్ల సమావేశంలో ధరల నియంత్రణకు ఎటువంటి చర్చ, చర్యలు చేపట్టకపోవడం గర్హనీయం విజయ డైరీ (కృష్ణాజిల్లా మిల్క్ యూనియన్) చైర్మన్ ను ప్రభుత్వ పెద్దలు బలవంతంగా రాజీనామా చేయించారు, నేడు చైర్మన్ లేరు, అయినా పండగ రోజు నుండి లీటర్ రెండు రూ.. చొప్పున పాలధర పెంచడం అమానుషం.
ఒకవైపున విజయ డైరీ ని పాలక పార్టీ పెద్దలు కైవసం చేసుకోవడం, మరోవైపు ధరలు పెంచి వినియోగదారుల నడ్డి విరచటం, హెరిటేజ్ ఇతర ప్రైవేటు డైరీలు ధరలు పెంచుకోవడానికి దారి చూపటం శోచనీయం.
పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, మహిళలు అందరికీ పౌష్టిక ఆహారమైన పాలను కూడా వదిలిపెట్టకుండా, కనికరం లేకుండా అడ్డగోలుగా రేట్లు పెంచడం దుర్మార్గం.
ఏప్రిల్ లో ధరలు పెంచారు, ఐదు నెలలు తిరగక ముందే మళ్లీ పాల ధరలు పెంచడం సరికాదు ఈ పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. నిత్యవసర వస్తువులు ధరలు తగ్గించాల్సిన ప్రభుత్వం అందుకు తగు చర్యలు తీసుకోకపోగా, ప్రభుత్వమే పాల ధరలు పెంచడం దారుణం
పాల ధరలు పెంచి సామాన్యుల జేబులు ఖాళీ చేసి నేతల జేబులు నింపుకోవడమే లక్ష్యంగా కనబడుతున్నది. నాడు ఆసుపత్రిలో ఉన్న చైర్మన్ రాజీనామా లేఖను ఆగమేఘాల మీద తీసుకోవటానికి అత్యుత్సాహం చూపించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు పాలధర పెంపుపై ఎందుకు స్పందించరు?.
కూటమి ప్రజాప్రతినిధులకు, నేతలకు... ప్రజల ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా కనబడుతున్నాయి. చైర్మన్ కూడా లేని మిల్క్ యూనియన్ లో ధరల పెంచాలని నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ప్రభుత్వం సంజాయిషీ చెప్పాలి.
బడా కార్పొరేట్ సంస్థలకు భూములు, రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం.. పాల సాకార సంఘాలకు ఎందుకు సహాయం చేయదు? ధరలను ఎందుకు అదుపు చేయదు?. బియ్యం ధరలు గత కొద్ది నెలల్లో కేజీ 20 నుండి 25 రూపాయలు పెరిగినా, ప్రభుత్వంలో చలనం లేదు, ప్రేక్షకపాత్ర వహించడం బాధాకరం.
రైతు బజార్ల ద్వారా చౌకగా బియ్యం అందిస్తామని ప్రకటనలు పూర్తిస్థాయిలో అమలు జరగటం లేదు. చౌకగా కందిపప్పు, ఉల్లిపాయలు తదితర నిత్యవసరాలు అందిస్తామని హామీ అమలు ఎక్కడ?, ధరల స్థిరీకరణ నిధి ఏమయ్యింది?.
ధరలను అదుపు చేయటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది, పైపెచ్చు ప్రభుత్వమే పాలు ,ఇతర ధరలను పెంచుతున్నది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, పార్లమెంటు, శాసనసభ్యులు ప్రజల గోడును పట్టించుకోవడం లేదు, ధరల పెరుగుదలపై నోరు మెదపకుండా అసమర్థులుగా మిగిలిపోయారు
నిత్యవసరాలు, పాల ధరలు ఎంత పెరిగినా... జనం తమకే ఓట్లేస్తారని అహం భావం పాలకుల్లో, నేతల్లో పెరిగిపోయింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధరల పెంచిన పాలకులకు ప్రజలే బుద్ధి చెప్పాలి.
పాలు, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి, నేతలను నిలదీయాలి. సిపిఎం పాలు, నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై ఆందోళన కొనసాగిస్తుంది, ప్రజలకు అండగా నిలుస్తుంది.
నేడు జరిగిన ఈ ఆందోళనలో సిపిఎం తూర్పు కమిటీ నేతలు పి. కృష్ణ, బి.చిన్నారావు, వి గురుమూర్తి, స్థానిక నేతలు కాయల లక్ష్మణ, వాజా శ్రీను, తాండవ కృష్ణ, తాత సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.




