Vijayawada: విజయవాడ పశ్చిమలోని 28 డివిజన్లలో కూటమి గెలుపు ఖాయం: బుద్ధా!
Vijayawada: పశ్చిమలోని 28 డివిజన్లలో కూటమి విజయం తథ్యమని బుద్ధా వెంకన్న ధీమా. సెప్టెంబర్ 16 నుంచి డివిజన్ల వారీగా సమావేశాలు.. ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం.
Vijayawada: విజయవాడ పశ్చిమలోని 28 డివిజన్లలో కూటమి గెలుపు ఖాయం: బుద్ధా!
విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మల్లికార్జునపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, క్లస్టర్, ఇంచార్జ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ బుద్ధా వెంకన్న గారు మాట్లాడుతూ రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలోని 28డివిజన్లలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న గారు మాట్లాడుతూ, “పశ్చిమ నియోజకవర్గంలోని 28 డివిజన్లలో కూటమి విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 16 వ తేదీన నుండి 21 వ తేదీ వరకు ప్రతి రోజు 4 డివిజన్‌లో పార్టీ మరియు క్యాడర్ సమావేశాలు నిర్వహించి సమర్థులైన అభ్యర్థుల పేర్లను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తాం. హైకమాండ్ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలి. రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సమష్టిగా సిద్ధమై, పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కూటమి జెండా ఎగురవేయాలని బుద్ధా వెంకన్న గారు పిలుపునిచ్చారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అర్హులైన ఒక్క వ్యక్తి కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా ఉన్నవారిని బూత్ స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వర్, గుర్రంకొండ, ఉమ్మడి చంటి, క్లస్టర్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.




