Vijayawada: విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో గిడుగు రామ్మూర్తి జయంతి!
Vijayawada: విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఏపీసీసీ ఆధ్వర్యంలో గిడుగు జయంతి. తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన పలువురికి ఘన సత్కారం.
Vijayawada: విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో గిడుగు రామ్మూర్తి జయంతి!
Vijayawada: తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని, తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేసిన మహనీయుడు శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఘనంగా నివాళులు అర్పించారు.
ఏపీసీసీ ఉపాధ్యక్షులు, అడ్మినిస్ట్రేషన్ ఇన్‌చార్జి శ్రీ కొలనుకొండ శివాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు భాష అభ్యున్నతికి, సాహిత్య, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న పలువురు ప్రముఖులను శాలువా కప్పి, మెమెంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు.
కార్యక్రమానికి గోళ్ల నారాయణరావు సభాధ్యక్షత వ్యవహరించారు.
ఈ సందర్భంగా రచయిత్రి శ్రీమతి దుట్టా శమంతకమణి, రచయిత్రి శ్రీమతి కోపూరి పుష్పవతి, సంగీతకారుడు శ్రీ దర్జా ఫణీంద్ర, లెక్చరర్ శ్రీ కప్పగంతు రామకృష్ణ, ఆకాశవాణి శ్రీ మాడుగుల రామకృష్ణ, లెక్చరర్ శ్రీ మసిముక్కు అంజయ్య, లెక్చరర్ శ్రీ అడుసుమిల్లి దుర్గాప్రసాద్, లెక్చరర్ శ్రీ ఉయ్యూరు సాంబిరెడ్డి, టీచర్ శ్రీ పోబిలి రాజశేఖర్, లెక్చరర్ శ్రీ ఆకునూరి నారాయణలను శాలువాలు, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతిని పరిరక్షించి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజల భాషను, వ్యవహారిక భాషను ప్రోత్సహించేందుకు గిడుగు వెంకట రామమూర్తి చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
తెలుగు భాషా వికాసానికి, సాహిత్య మరియు సాంస్కృతిక రంగాలకు తమ సేవలను అందిస్తున్న ప్రముఖులను గుర్తించి సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించడంతో పాటు, భావితరాల్లో తెలుగు భాష పట్ల మరింత ఆసక్తి, అభిమానం పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు శ్రీ కొలనుకొండ శివాజీ తెలిపారు
కాంగ్రెస్ నాయకులు నరహరశెట్టి నరసింహారావు, మీసాల రాజేశ్వరరావు, స్పోర్ట్స్ చైర్మన్ కమలాకర్, మహిళా నేత కుర్సీద,sa అన్సారీ లు పాల్గొన్నారు. అందరిని శాలువ మెమెంటో తో సత్కరించటం జరిగింది. శివాజీ మాట్లాడుతూ ఎపి లో పాలన భాష గా తెలుగు నీ అమలు చెయ్యాలని ప్రభుత్వ GO లు , కోర్టు తీర్పులు తెలుగులో ఉండాలని తెలుగు రాష్ట్రంలో ఆంగ్ల
నామపాలకాలతో బోర్డ్ లు ఉంటే ఫైన్ జరిమానా విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పండితులకు ధన్యవాదాలు తెలియ చెయ్యటం జరిగింది.




