Vijayawada: ఇంద్రకీలాద్రిపై పచ్చదనం పెంపు ఏడీసీ చైర్మన్ పరిశీలన!

Vijayawada: ఇంద్రకీలాద్రిపై పచ్చదనం పెంపు, సుందరీకరణ పనులను పరిశీలించిన ఏడీసీ చైర్మన్ డి. లక్ష్మి పార్థసారధి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు చర్యలని వెల్లడి.

Satyanarayana, Vijayawada
Published on: 10 Sept 2026 12:06 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై పచ్చదనం పెంపు ఏడీసీ చైర్మన్ పరిశీలన!

Vijayawada: ఈరోజు సాయంత్రం అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి డి. లక్ష్మి పార్ధసారధి ఇంద్రకీలాద్రికి విచ్చేసారు. రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఇంద్రకీలాద్రి పై పచ్చదనం పెంపు, సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు ఆవిడ తెలిపారు.

ఈ సందర్బంగా వివిధ ప్రదేశములను తమ అధికారులతో కలిసి పరిశీలన చేసారు. ఈ కార్యక్రమం లో దేవస్థానం ఈవో శ్రీ వికె శీనా నాయక్, ఈఈ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీమతి డి. లక్ష్మి పార్ధసారధి అమ్మవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీస్సులు పొందారు.

Satyanarayana, Vijayawada

Satyanarayana, Vijayawada

Next Story