Big Debate: "డీఎస్సీలో అక్రమాలు నిజం": మంత్రి లోకేష్ రాజీనామాకు YSRCP డిమాండ్!
Big Debate: మెగా డీఎస్సీ నియామకాల్లో రూల్స్ మార్చి అక్రమాలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్ ఆరోపించారు.
Big Debate: "డీఎస్సీలో అక్రమాలు నిజం": మంత్రి లోకేష్ రాజీనామాకు YSRCP డిమాండ్!
Big Debate: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియలో తీవ్రస్థాయిలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘాటుగా ఆరోపించింది. నిబంధనలు మార్చి తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని, ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని, విచారణను ప్రభావితం చేయకుండా ఉండేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని YSRCP నేత కాకుమాను రాజశేఖర్ డిమాండ్ చేశారు.
hmtv 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నిర్వహణలో జరిగిన పలు సంచలన విషయాలను బయటపెట్టారు. డీఎస్సీ నియామక ప్రక్రియ కోసం ప్రత్యేక కన్వీనర్‌ను నియమించకుండా, నేరుగా SCERT డైరెక్టర్‌తోనే పరీక్షలను నిర్వహించారని, తమకు అనుకూలంగా ఉద్యోగాలు ఇచ్చుకోవడానికే ఇలా చేశారని రాజశేఖర్ విమర్శించారు.




