Big Debate: ఓటర్ లిస్ట్‌లో పేరు మిస్‌మ్యాచ్.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి నోటీసు!
Big Debate: ఓటర్ లిస్ట్‌లో పేరు మిస్‌మ్యాచ్ కావడంతో 70 ఏళ్ల వయసులో తొలిసారి నోటీసు రావడాన్ని ఓటర్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
Big Debate: ఓటర్ లిస్ట్‌లో పేరు మిస్‌మ్యాచ్.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి నోటీసు!
Big Debate: ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా తలెత్తుతున్న సాంకేతిక లోపాలు ఓటర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దశాబ్దాలుగా ఓటు హక్కు కలిగి ఉండి, క్రమం తప్పకుండా ఎన్నికల్లో ఓటు వేస్తున్న సీనియర్ సిటిజెన్లకు కూడా ఇప్పుడు కొత్తగా నోటీసులు వస్తుండటం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై తాజాగా జరిగిన ఓ ప్రత్యేక డిబేట్‌లో ఓటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బహిర్గతమయ్యాయి.
గత 50 ఏళ్లకు పైగా నిరంతరం ఓటు హక్కును వినియోగిస్తున్న గౌరీశంకర్ అనే వ్యక్తికి తాజాగా ఓటర్ జాబితా విషయమై నోటీసు అందడం కలకలం రేపింది. ఎన్నో ఏళ్లుగా ఎలాంటి సమస్య లేకపోయినా, ఈసారి మాత్రం ఓటర్ ఐడీ కార్డ్‌లో ఉన్న ఇనిషియల్స్ (ఇంటి పేరు/పేరు సంక్షిప్తీకరణ) పూర్తి పేరుగా ఎక్స్‌పాండ్ చేయడం వల్ల ఈ గందరగోళం తలెత్తిందని ఆయన తెలిపారు.
ఓటర్ ఐడీ కార్డ్‌లో 'టీఆర్ గౌరీశంకర్' అని ఉండగా, కొత్త జాబితాలో అది 'చనువాల రామలింగం గౌరీశంకర్'గా మారడంతో డేటా మిస్‌మ్యాచ్ ఏర్పడిందని ఆయన వివరించారు. అధికారులు ఫోన్ చేసి ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాత ఓటర్ ఐడీ వంటి ధ్రువీకరణ పత్రాలతో రావాలని సూచించడంతో తాను స్వయంగా వెళ్లి వివరాలు సరిదిద్దుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఒక్క తనకే కాకుండా ఆ రోజు కేంద్రం వద్దకు సుమారు 40 మందికి పైగా ఇలాంటి నోటీసులే వచ్చాయని, అధికారుల తీరుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. డ్రాఫ్ట్ జాబితా ప్రకటన అనంతరం నిబంధనలు, సర్వే తీరుపై మరింత స్పష్టత రావాల్సి ఉందని ఈ చర్చలో అభిప్రాయపడ్డారు.




