Off The Record: చిలకలూరిపేటలో వైసీపీకి డ్యామేజీ!

Off The Record: చిలకలూరిపేట వైసీపీలో విడదల రజనీ బినామీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నలుగురు నేతల వల్ల పార్టీ భ్రష్టు పడుతోందంటూ కేడర్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 9 Sept 2026 8:03 AM IST
Off The Record
X

Off The Record: చిలకలూరిపేటలో వైసీపీకి డ్యామేజీ!

Off The Record: ఏపీ మాజీ మంత్రి విడదల రజనీ ఎక్కడ ఉన్నా వావాదాలే. ఎమ్మెల్యే, మంత్రిగా అయిదేళ్లు కాలం తన ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న అపవాదు లేకపోలేదు. పార్టీ నిబంధనలే కాదూ.. తాను నిర్ణయించిన విధానాలనూ అందరూ ఫాలో కావాలని ఆదేశిస్తారట రజనీ మేడమ్. ఇందుకోసం తన సొంత మనుషులతో ఒక స్వంతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకొని తన నిర్ణయాల అమలు చేస్తున్నారట. వైసీపీ కేడర్ అభిప్రాయాలకే కాకుండా వారికీ అణాసైసా విలువ లేకుండా చేసేశారట.

రజనీ మేడమ్‌ను కనీసం కార్యకర్తలు కలవాలన్నా బినామీల గ్రీన్ సిగ్నల్ కావాల్సిందేనట. ఈ పరిస్థితితో ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో పార్టీ జెండా ఎవరూ పట్టుకోవటానికి ముందుకు రావటం లేదన్న టాక్ చిలకలూరిపేటలో రీసౌండ్ చేస్తోంది. ఇలా షాడోల పెత్తనాలు పెరిగిపోవడంతో ఆ మాజీమంత్రి బినామీలను తప్పిస్తేనే.. తాము పార్టీలో ఉంటామని అల్టిమేటం కూడా జారీ చేశారట అసలుసిసలు వైసీపీ శ్రేణులు. ఆ మాజీ మంత్రి బినామీల కారణంగా అక్కడ వైసీపీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందన్న టాక్ రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది.

విడదల రజనీ మంత్రిగా ఉన్న సమయంలో పార్టీలో పదవులతోపాటుగా సచివాలయ ఉద్యోగాలు అమ్ముకున్నారనే ఆరోపణలు అప్పట్టో బాగానే వినిపించాయి. రజనీ వెనుక కోటరీగా వ్యవహరించిన ఈశ్వరరెడ్డి, గోపి.. అనే ఇద్దరు తెరవెనుక చక్రం తిప్పేవారట. ఇప్పటికీ పదవులు పోయినా వారి ఆర్భాటం తగ్గలేదన్న టాక్ లేకపోలేదు. ఆ ఇద్దరూ మేడమ్ షాడోలుగా పెద్దపెద్ద కార్లలో తిరుగుతూ పెత్తనం చెలాయిస్తున్నారట. పార్టీలో ఎవరైనా మంత్రిని కలవాలి అనుకుంటే ముందుగా ఈ ఇద్దరి కలవాల్సిందేనట. ఆ ఇద్దరు ఓకే అంటేనే మేడమ్‌గారిని కలిసే అవకాశం ఉంటుందన్న మాట. అధికారంలో ఉన్నా.. అధికారంలో లేకపోయినా వారి హవా, దర్జా, హంగూఆర్భాటం ఏమాత్రం తగ్గలేదంటున్నారు ఆ పార్టీలోని ఒకరిద్దరు కార్యకర్తలు. కాగా.. వీరిద్దరి దెబ్బతో పార్టీ కోసం అన్నీ త్యాగం చేసిన కార్యకర్తలు లబోదిబో మంటున్నారట. పార్టీ నాయకత్వానికి చెబుదామని ప్రయత్నించినా పట్టించుకునే వారు లేక.. సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారని సమాచారం.

వీరిద్దరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఓ కార్యకర్త తన ఆవేదనను సోషల్ మీడియా పోస్టులో పెట్టారు. అవి ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. విడదల రజనీతోపాటుగా ఆ ఇద్దరి ఘనకార్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అసలు రాజకీయం తెలియని వారు రజనీ పేరుతో నియోజకవర్గంలో పార్టీ పెత్తనం చేస్తున్నారట. పది ఓట్లు కూడా తేలేని వారు కేడర్‌ను దూరం చేస్తున్నారని, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్టింగ్స్ కనిపిస్తున్నాయి. ఈశ్వరరెడ్డి, గోపి, కందుల శ్రీకాంత్, మానుకోండ శేషిరెడ్డి ఈ నలుగురు వ్యక్తులు వైసీపీని భ్రష్ఠు పట్టిస్తున్నారని స్వయంగా వైసీపీ కార్యకర్తలే వాపోతున్నారట. ఈ నలుగురు చెబితేనే మాజీ మంత్రి కేడర్‌లో ఎవరికైనా కలిసే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు.

వీరి వ్యవహార శైలితో చిలకలూరి పేట వైసీపీ పూర్తిగా దారి తప్పిందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో రీసౌండ్ చేస్తోంది. పార్టీ ఇక కోలుకోలేని విధంగా వీరు నష్టం చేస్తున్నారని తొలి నుంచి వైసీపీనే నమ్ముకున్న కార్యకర్తలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక చేసేది లేక ఆ నలుగురి బాగోతాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇలాగైనా వైసీపీ అధిష్టానం అసలు విషయం గమనిస్తుందని బాధిత కార్యకర్తలు భావిస్తున్నారట. కాగా.. తాజాగా వైఎస్ వర్ధంతి సందర్బంగా కొన్ని చోట్ల రజనీకి ఆహ్వనం అందలేదు. అయితే.. వైసీపీలో ఉంటూ.. రాజకీయాలు చేస్తూ.. పదవీ దర్పం అనుభవిస్తూ.. వైఎస్సార్ వర్థంతి నాడు ఆయన బొమ్మకు దండలు వేయటం మినహా.. ఆయన గురించి ఒక్క మాట కూడా చెప్పకవపోటం కేడర్‌కు రుచించటం లేదట. చిలకలూరిపేట నియోజకవర్గంలో వీరు చేస్తున్న పార్టీ- ప్రజా వ్యతిరేక విధానాలపై అధినాయకత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నాయి. ప్రస్తుతం వీరి దెబ్బకు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. పక్క నియోజకవర్గం వారిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట.

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేడర్‌కు అండగా నిలుస్తూ.. పార్టీని బలోపేతం చేయాల్సిన వేళ పార్టీ అధికారంలో ఉన్న టైంలో పదవులు అనుభవించి.. ఆ నలుగురి చేతిలో బందీగా మారిన రజనీతో చిలకలూరిపేటలో జరుగుతున్న నష్టం ఏంటో తెలుస్తోందా అని అసలుసిసలు కార్యకర్తలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినాయకత్వం చిలకలూరిపేటలో జరుగుతున్న ఈ తంతుపై ఫోకస్ పెడుతుందా..? పార్టీని గాడిలో పెడుతుందా..? అని ఆవేదన చెందుతున్నారు. ఆ కార్యకర్తల గోడు వైసీపీ అధిష్టానం గ్రహిస్తుందో.. లేదో.. చూడాలి మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story