Jordar News: ఉప్పల్ మైదానం లో బ్లాక్ టికెట్ల దందా.. 39 వేల టిక్కెట్లు మాయం
Jordar News: హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ మైదానం మరోసారి బ్లాక్ టికెట్ల దందాతో వార్తల్లోకెక్కింది.
Jordar News: ఉప్పల్ మైదానం లో బ్లాక్ టికెట్ల దందా.. 39 వేల టిక్కెట్లు మాయం
Jordar News: ఒకప్పుడు పెద్ద హీరో సీన్మా రిలీజైదంటే టిక్కెట్లు బ్లాకుల అమ్ముదురు. కని, ఆరోజులు లెవ్వుల్ల ఇప్పుడు. ఓటీటీలచ్చి, టాకీస్లు శిన్నవోతున్నయి కని, కిరికేట్ల అట్లగాదు.. ఇంటర్నేషనల్ మ్యాచులైనా, ఐపీఎల్ మ్యాచులైనా.. బ్లాక్ టికెట్ల దందా గట్టిగ నడుస్తున్నది. అండ్ల ముఖ్యంగ ఉప్పల్ మైదానమంటెనే బ్లాక్ టికెట్లు దందా ఓ రేంజిల నడుస్తుంటది ఎందుకోగని. అట్లనే జేశి ఈతాపు గుడ ఉప్పల్ మైదానం పేరును వార్తల్లకెక్కిచ్చిర్రు మల్ల. ఇయ్యల్ల ఉప్పల్ మైదానంల SRH, RCB నడ్మ తగ్గపర్ మ్యాచ్ ఉండుట్ల ఫ్యాన్సు క్రేజును బ్లాక్ టికెట్ల దందా జేశేటొల్లు గట్టిగనే క్యాష్ జేస్కున్నరు. శిన్నగలేదు గదా మల్ల దందా.. 950 రూపాల టికెట్ను 1950కి, కార్పొరేట్ బాక్స్ టికెట్ను లక్షకు, మొత్తం కార్పొరేట్ బాక్సును 30 లక్షలకు అమ్ముకున్నరట దందా జేశేటొల్లు.
కొన్ని నిమిషాల్లనే 39 వేల టికెట్లు మాయమైనయట అంటే సూడుర్రి ఎట్లున్నదో కథ. ముచ్చట తెల్శి ఈ దందాపై మీద నజరేశిన పోలీస్లు ముఠాను దొర్కవట్టి అరెస్టు జేశిర్రు. పది కేసులదాంక నమోదయినయట ఆల్లమీద. ఇగిది ఇట్లుంటె, ఇంకోపక్క సందుట్ల సడేమియ్యాలెక్క సైబర్ నేరగాళ్లు ఇంకో దందా నడ్పిర్రు. నకిలీ యాప్ తయార్జేశి ఫేక్ టికెట్లు సేల్ జేశిర్రట. నిజమనుకోని ఐపీఎల్ ఫ్యాన్స్ గుడ టికెట్లు కొన్నరట కొందరు. మొత్తానికి ఉప్పల్ స్టేడియం అంటెనే గింత అన్నట్టు జేస్తున్నరు గదా.. ఈ దందా పాడువడా. మరి ఇంతగనం జర్గుతుంటె హైదరాబాద్ కిరికేట్ పెద్దలు ఏం జేస్తున్నట్టో.. గుడ్డు గుర్రం పండ్లు తోముతున్నరో ఏమో పోన్రి.




