Jordar Varthalu: బండి గాలిలో ఎగరడం అంటే ఇదేనేమో?
Jordar Varthalu: కెనడాలో జరిగిన ఒక వింత రోడ్డు ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో ఇది.
Jordar Varthalu: బండి గాలిలో ఎగరడం అంటే ఇదేనేమో?
Jordar Varthalu: వాయమ్మనే.. నిజంగనే బండి గాల్లెకు ఎగిరిందిగదా. సూస్తుంటే దాన్ని ఎవ్వలో క్రేనోతోని తీస్కపోయి ట్రాఫిక్ సిగ్నల్కు ఏలాడదీశినట్టే అన్పిస్తున్నదిలే. కనీ., కాదు. కెనడా దేశంలున్న సర్రే-డెల్టా సరిహద్దు ప్రాంతంల జరిగిందీ రోడ్డు ప్రమాదం. ఈ కూడలి కాడ బీఎండబ్ల్యూ కారును బండి మస్తు స్పీడ్లచ్చి టక్కర్ వెట్టిందట. దీంతోని బండి ఎగిరిపోయి సీదా ట్రాఫిక్ సిగ్నల్ పోలుకు తట్టుకోని ఏలాడవడ్డది. ఇగింత పెద్ద ప్రమాదం జర్గినా అదృష్టవశాత్తు బండి నడుపుతున్న మన్షి దెబ్బలతోనే బైటవడ్డడుగనీ., పాణాలకేం ప్రమాదం కాలేదట.
ఇగ కారు డ్రైవర్ సుతం శిన్నశిన్న గాయాలతోని బయటపడ్డట. కనీ., గాలిల ఏలాడుతున్న బండిని సూశి అటుదిక్కు వొయ్యేటోళ్లు మస్తు పర్శాన్ అయితున్నరట. ఇగ కొందరు ఈ వింత ప్రమాదం సూడుర్రని వీడియో దీశి సోషల్ మీడియాల ఇడుస్తే ఆ బండి పోయిన స్పీడ్ కంటెక్కో స్పీడ్ తోని దున్యా మొత్తం తిరుగుతుందిప్పుడు. ఒక్కొక్కపారి జరిగే ప్రమాదాలను అస్సల్కే ఊహించలేము. కండ్లు మూశి తెర్శేలోపట్నే జరుగుతయి. ఇగ ప్రమాదం జరిగిన తర్వాత దాని పరిణామాలు గుడ శానా తీవ్రంగనే ఉంటయని కామెంటుతున్నరు నెటిజన్లు. మరిగ పబ్లిక్కు.. మీరైతే రోడ్ల మీదకి పోయినప్పుడు జర్ర నిమ్మలంగ తోలుర్రు బండ్లైనా, కార్లైనా. ఏమంటున్నం.




