Jordar Varthalu: ఇది ఇంజన్ ఆయిల్ కాదు..స్వచ్చమైన మంచినూనె అంట

Jordar Varthalu: హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. పదే పదే వాడిన నూనెతో ఉల్లిపాయ ఫ్రై తయారు చేస్తున్న అక్రమ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 April 2026 8:17 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: ఇది ఇంజన్ ఆయిల్ కాదు..స్వచ్చమైన మంచినూనె అంట

Jordar Varthalu: సూస్తుంటే ఏదో శెక్కపొట్టును కవర్లల్ల నింపిర్రని అన్పిస్తున్నదిలే. దాన్ని సూస్తె అట్ల అన్పిచ్చుట్ల తప్పేం లేదుగనీ., అసల్కు ఇదేంటిదంటే., ఫ్రై జేశ్న ఉల్లిగడ్డలన్నట్టు. ఇగా ఉల్లిగడ్డలను ఎంత సక్కటి నూనెల ఏయించిర్రనేది గుడ సూడుర్రోపారి.

మీరు సూస్తున్నది బండ్లు, కార్లల్ల కెంచి తీశ్న కాలిపోయిన ఇంజన్ ఆయిల్ గాదు. అది బరాబర్ ఉల్లిగడ్డలను ఏయించిన శుభ్రమైన నూనెనే అని సూశ్నోల్లు అనుకోవాలే. వామ్మో.. సూస్తుంటెనే యాక్.. తూ.. పాడుగానూ.. గిసొంటి నూనెల ఉల్లిగడ్డలను ఏయించుతున్నరా అని అన్పిస్తున్నదిగదా. మరిగ మనం ఏ హోటల్కు పోయినా అంట అర్రలకు పోయి ఎట్ల జేస్తున్నరనేది సూడంగావట్టి., స్వచ్చమైన నూనెతోనే చేస్తరని అనుకుంటం. కనీ., అసలు నిజం మాత్రం ఇగో గిట్లుంటది. మరిగ ముచ్చటేందంటే., పట్నం కూకట్‌పల్లి దగ్గర్లున్న కైతలాపూర్ల నసీబ్ బిర్ష్ స్టా కేంద్రం మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు ఆకస్మిక దాడులు జేశిర్రు. ఇగాడి వాతావరణం జూస్తే మల్లోపారి బైటేమన్న తినాలన్న ఆలోశనచ్చినా కడుపులది మొత్తం దేవేశినట్టయ్యేతట్టున్నది. వాడిన నూనెనే మల్లా మల్లా వాడి కర్రెగ జిడ్డుగయ్యే దాంక వాడుతున్నరని తేలింది. దీంతోని ఆహార భద్రతా నిబంధనలను పాటిస్తలేరని ఎంటనే ఆ కేంద్రాన్ని సీజ్ జేశి ఈ దందా జేస్తున్నోల్ల మీద కేసు రాశిర్రు. అట్లనే వెయ్యి కిలోల ఉల్లిపాయలు, 480 కిలోల నూనె, 75 కిలోల ఫ్రైడ్ ఆనియన్స్, ఒక ఆటో స్వాధీనం జేస్కున్నరు. ఇసొంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగ ఉండాల్నని, ఏమన్న డౌటాన్మానాలు వస్తె ఎంటనే ఎస్ఓటి పోలీసులు ఫిర్యాదు జెయ్యాల్నని జెప్పిర్రు పోలీసులు. మరిగ పబ్లిక్కు.. బైట తినే ముందు ఒకటికి రొండు మాట్లా సూస్కోండ్రి. లేకుంటె అటెంక మీ పాణాలే పర్శాన్ల పడ్తయి మరి. ఏమంటున్నం. సరేనా.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story