Jordar News: నడుస్తూనే 5 లక్షలు కొట్టేసాడు..

Jordar News: అహ్మదాబాద్‌లో వింత దొంగతనం. ఫోన్లో మాట్లాడుతూ వెళ్తున్న వ్యక్తి బ్యాగ్ నుండి రూ. 5.5 లక్షలు దొంగిలించిన దొంగ. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Jun 2026 7:22 AM IST
Jordar News
X

Jordar News: నడుస్తూనే 5 లక్షలు కొట్టేసాడు..

Jordar News: ఓశినీ.. దోస్తుగాడు బ్యాగు సద్రినట్టు ఎంత అల్కగ సద్రుతున్నడో గద నోట్ల కట్టలను. తాళాలు పల్గొట్టి, బండ్ల మీద చేజింగ్లు జేశి, నిద్ర జెడగొట్టుకొని డ్యూటీ జేశే అవ్రసమే లేకుంట.. అల్కగ దోస్కపొయ్యే ఛాన్సు ఇచ్చినట్టున్నడు గద ఈనె దొంగకు. గుజరాత్ దిక్కు అహ్మదాబాద్ కాడున్న మానెక్ చౌక్ల దొంగోడు ఎన్కమాల నడ్సుకుంటనే.. ఐదున్నర లక్షల రూపాలను ఎత్కపోయి శెరిత్ర సృష్టించిండు. బ్యాగుల పైసలున్నయన్న సొయ్యి సుతం లేదు ఈ జబ్బల బ్యాగాయ్నకు. బ్యాగుల పైసలు లోపటేస్తున్నా.. పట్టిచ్చుకోకుంట నిమ్మలంగ ఫోన్ల మాట్లాడుకుంట పోతనే ఉన్నడు. దగ్గర్దగ్గర నిముషంలనే బ్యాగులున్న ఐదున్నర లక్షలను పొతంపెట్టిండు దొంగోడు. మరి ఈ బ్యాగన్న ఫోన్ మాయల పడి ఇంటికి పోయ్నంకనే సూస్కున్నట్టున్నడు.

పైసలు మాయమైనయని లబలబ మొత్తుకొని ఠానాకు పోతే.. బుడ్డ కెమ్రాలల్ల సూశి, పైసలెట్ల మాయమైనయో రివీల్ జేశిర్రు ఖాకీలు. సొంతతప్పే అని తెల్శి షాకై శేకైనట్టున్నడు అన్న. నీ అసొంటి సొయ్యి లేనోల్లు జెయ్యవట్టే ఇసొంటి దొంగబడ్మెగాల్లు పుట్టుకత్తున్నరని నాలుగు జోపినట్టున్నరు ఖాకీలు. ఇసొంటి సీన్లు సిన్మాల సూశి, గింత సొయ్యి లేకుంట ఉంటరా అని అనుకునేది కని.. ఇసొంటోల్లను సూశ్నంక నిజమే అనిపిస్తున్నది పోర్రి. జనాలూ.. బ్యాగుల పైసలు పట్కొని పొయ్యెటప్పుడు జర్రంత భద్రం మరి. పైసలుంటే.. బ్యాగును ముంగటికేసుకోర్రి. ఒగాల ఎన్కకేశ్నా.. ఎన్కాముందు ఎవలు వోతున్నరు ఏంకథ ఓ కంట కనిపెట్టుకోర్రి. లేకుంటె.. దొంగతనం జేశెటోల్లకు ఒక్క ఛాన్సు ఇచ్చినట్టే అయితది సూస్కోర్రి మల్లా. అటెంక చెప్పలేదనద్దు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story