Off The Record: కార్పోరేషన్ పదవుల్లో కొత్తవాళ్ళకే చాన్స్

Off The Record: తెలంగాణలో 50కి పైగా కార్పొరేషన్ చైర్మన్ల నామినేటెడ్ పోస్టుల పదవీ కాలం ముగిసింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 July 2026 6:49 AM IST
Off The Record
X

Off The Record: కార్పోరేషన్ పదవుల్లో కొత్తవాళ్ళకే చాన్స్

Off The Record: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల పదవీ కాలం ముగిసింది. దీంతో రేవంత్ రెడ్డి సరికొత్త రాజకీయ వ్యూహానికి తెరలేపుతున్నారట. 50కి పైగా కార్పొరేషన్ చైర్మన్ల భవిష్యత్తు ఇప్పుడు అధిష్టానం చేతుల్లో ఉండటంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రెండేళ్లుగా చైర్మన్ల పనితీరు, పార్టీ బలోపేతానికి వారు చేసిన కృషిపై నివేదికలు సిద్ధమయ్యాయట.

గ్రూపు రాజకీయాలకు తావులేకుండా 'మెరిట్' ఆధారంగానే ఈసారి నిర్ణయాలు ఉంటాయని టాక్. ఈ క్రమంలో ఆశావహులు నేరుగా ఏఐసీసీ పెద్దలతో లాబీయింగ్ మొదలుపెట్టారట. ఇంతకీ ఎవరి పదవి ఉంటుంది..? ఎవరి పదవి ఊడుతుంది..? ఎవరికి కొత్తగా పదవులు దక్కనున్నాయన్నది ఉత్కంఠగా మారింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story