News Analysis: సామాన్యుల పన్నులతో అంబానీ, అదానీ కంపెనీలకు సబ్సిడీలా?: బీఆర్‌ఎస్ నేత చిరుమల్ల రాకేష్

News Analysis: సామాన్యుడి పన్నుల డబ్బులతో కార్పొరేట్ కంపెనీలకు సబ్సిడీలు, లోన్ రైట్ ఆఫ్‌లు ఎందుకు ఇస్తున్నారని బిఆర్ఎస్ నేత చిరుమల్ల రాకేష్ ప్రశ్నించారు. హైకోర్టు వ్యాఖ్యలపై కీలక విశ్లేషణ.

Arun Chilukuri
Published on: 8 Aug 2026 12:10 PM IST
News Analysis
X

News Analysis: సామాన్యుల పన్నులతో అంబానీ, అదానీ కంపెనీలకు సబ్సిడీలా?: బీఆర్‌ఎస్ నేత చిరుమల్ల రాకేష్

News Analysis: లగ్జరీ బైకులు ఉన్నవారికి ఫీజు రీయింబర్స్‌మెంట్, కోటీశ్వరులకు రైతు బంధు అవసరమా అంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో 'ఉచిత పథకాలు - అర్హతలు' అనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ అంశంపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, డాక్టర్ చిరుమల్ల రాకేష్ స్పందిస్తూ.. సంక్షేమ పథకాలపై ప్రశ్నలు లేవనెత్తే సమయంలో బడా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్న రాయితీలపై కూడా సమీక్షించాలని డిమాండ్ చేశారు.

సామాన్య, మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా ప్రభుత్వ ఖజానా నిండుతోందని, కానీ ఆ సొమ్ము నుంచి అంబానీ, అదానీ వంటి బడా వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థలకు వేల కోట్ల రూపాయల రుణాలను రైట్ ఆఫ్ (మినహాయింపు) చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇండస్ట్రియల్ ఏరియాలు, కోకాపేట్ వంటి విలువైన ప్రాంతాల్లో కంపెనీలకు తక్కువ ధరకు భూములు కేటాయిస్తున్నప్పుడు లేని అభ్యంతరం, ప్రాథమిక రంగమైన వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులకు సాయం అందిస్తే ఎందుకు వస్తుందని నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story