Jordar News: ఫ్యూచర్ సిటీ ఉండదు? సీఎం రేవంత్ కు బిగ్ షాక్?

Jordar News: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 'ఫోర్త్ సిటీ' అలియాస్ 'భారత్ ఫ్యూచర్ సిటీ' ప్రాజెక్టుపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 May 2026 7:30 AM IST
Jordar News
X

Jordar News: ఫ్యూచర్ సిటీ ఉండదు? సీఎం రేవంత్ కు బిగ్ షాక్?

Jordar News: అగ్గో ఏంది సారూ ఒక్కటేపారి గంత మాట అంటిరి.. సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగ తీస్కోని ఫ్యూచర్ సిటీని కడ్తున్నమని జెప్తే మీరేమో.. అధికారంలకు రాంగనే దాన్ని రద్దు జేశి పారేస్తమని అంటున్నరు. ఇంతకూ మీరు అట్లెందుకు అంటున్నరు..

అదన్నట్టు ముచ్చట. ఫార్మసిటీ కోసం రైతుల దగ్గరి నుంచి తీస్కున్న భూములల్ల ఫార్మాసిటీ మాత్రమే కట్టాల్నట. ఒకవేళ ఆ భూమిని వేరే అవుసరాల కోసానికి వాడుతె మాత్రం ఆ భూములను రైతులు మళ్లా ఎన్కకు తీస్కోవచ్చని పార్లమెంటే చట్టం చేసిందట. గందుకే.. అయితే ఆ భూములల్ల ఫార్మాసిటీ కట్టాలే. లేకుంటె మళ్లా రైతులకే ఇచ్చేయాలన్నట్టు. గందుకే మేం అధికారంలకచ్చినంక ఫ్యూచర్ సిటీని రద్దు జేశి ఫార్మాసిటీ కడ్తమని జెప్పుకచ్చిండు హరీష్ రావు సారు. అమెరికాకు పోయిన హరీషన్న ఆడ గిట్ల మాట్లాడుతే., దీని మీద శేతి పార్టీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి సారు గిట్లన్నడు.

బీఆర్ఎస్ హయాంల కాలుష్య పరిశ్రమలు తీస్కత్తే., రేవంత్ రెడ్డి మాత్రం భారత్ ఫ్యూచర్ సిటీ పేర్మీద గొప్పగ అభివృద్ది జేద్దామని సూస్తే మాకు ఎక్కడ మంచి పేరు అస్తదోనని ఓర్వలేకనే ఇట్ల విమర్షలు జేస్తున్నరని గరానికచ్చిండు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సారు. మొత్తానికైతే., ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఎట్లుంటదో తెల్వదిగనీ., ఇప్పట్కైతే లీడర్ల నడ్మ మాత్రం వార్ గట్టిగనే నడుస్తున్నది పోండ్రి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story