Off The Record: బీజేపీ లో నేతల మధ్య వర్గ పోరు.. అధిష్టానం వార్నింగ్

Off The Record: తెలంగాణ బీజేపీలో ముదురుతున్న వర్గపోరు. కొత్త, పాత నేతల మధ్య ఆధిపత్య పోరుపై రాష్ట్ర సారధి రామచంద్రరావు సీరియస్ వార్నింగ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 April 2026 1:36 PM IST
Off The Record
X

Off The Record: బీజేపీ లో నేతల మధ్య వర్గ పోరు.. అధిష్టానం వార్నింగ్

Off The Record: తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా ఎన్నో ఏండ్లుగా అధిష్టానం చేయని ప్రయత్నమంటూ లేదు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తప్ప సొంతంగా ఏ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాలేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో టీడిపి, జనసేనలతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కమలం పార్టీ.

సౌత్ ఇండియాకు గేట్‌వేగా ఉన్న తెలంగాణలో పాగా వేయాలని ఉవిళ్లూరుతున్న జాతీయ నాయకత్వం. ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ నేతలకు మార్గదర్శనం, సలహాలు, సూచనలు ఇస్తూ పార్టీ బలోపేతానికి అన్నీ ప్రయత్నాలు చేస్తోంది. కానీ అవన్నీ మాకేమీ పట్టన్నట్టు నిర్లక్ష్య ధోరణితో రాష్ట్రంలోని కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలను చూసి చూడనట్టు వ్యవహారిస్తున్నారట.

అంతేకాదు తెలంగాణ రాష్ట్ర శాఖలో కొత్త-పాత నేతల మధ్య అంతర్గత కొట్లాటలు, కుమ్ములాటలు మితిమీరిపోతున్నాయట. ఇలాగే వదిలేస్తే. పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని గ్రహించిన రథసారథి. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారట. అందులో భాగంగానే అంతర్గత పోరుపై రాష్ట్ర రథసారథి రాంచందర్ రావు సీరియస్ కావడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story