Big Debate: తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యలు గాలికి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై బీజేపీ విమర్శలు
Big Debate: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రజా సమస్యల చర్చను పక్కనపెట్టి, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రచ్చకు వేదికగా మారుతున్నాయని...
Big Debate: తెలంగాణ అసెంబ్లీలో ప్రజా సమస్యలు గాలికి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుపై బీజేపీ విమర్శలు
Big Debate: తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రజా సమస్యల చర్చను పక్కనపెట్టి, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ రచ్చకు వేదికగా మారుతున్నాయని బీజేపీ సీనియర్ నేత వెంకట్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు, రెండు పార్టీల వైఖరిపై ఆయన డిబేట్‌లో తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చట్టసభలు ప్రజల సమస్యలను చర్చించే దేవాలయాలు లాంటివని, అలాంటి చోట గత మూడు రోజులుగా సభ సజావుగా సాగకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ నిర్వహణ కోసం ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నప్పటికీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు, నిరసనలతో సభను ముందుకు సాగనివ్వకుండా అడ్డుకుంటున్నాయని విమర్శించారు.
Next Story




