Jordar News: మోదీ సార్ చేసిన పనికి పబ్లిక్ ఫిదా
Jordar News: పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం!
Jordar News: మోదీ సార్ చేసిన పనికి పబ్లిక్ ఫిదా
Jordar News: పచ్చిం బెంగాల్ రాష్ట్ర తొమ్మిదో ముఖ్యమంత్రిగ సువెందు అధికారి శేత గవర్నర్ ఆర్ఎన్ రవి సారు ప్రమాణ స్వీకారం చేయించిండు. కోల్‌కతాలున్న బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ల జరిగిందీ ప్రమాణస్వీకార కార్యక్రమం. ఇగీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ సారు, సెంటర్ హోంమంత్రి అమిత్ షా తోనట్టుగ ఎన్డీఏ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులు హాజరువడ్డరు. ఏపీ సీఎం చంద్రబాబు సారు సుతం ఈ కార్యక్రమానికి హాజరువడి హల్చల్ జేశిండు.
ప్రమాణ స్వీకారం జేశ్నంక ప్రధాని మోడీ సారు ఆశీస్సులు తీస్కున్నడు సువెందు అధికారి. అటెంక అచ్చిన అతిరథమహాశయులందరి శేతుల శెయ్యేసిండు. ఇగీ కార్యక్రమానికి హాజరువడ్డ మోడీ సారు.. సాష్టాంగ నమస్కారం జేశిండు బెంగాల ప్రజలకు. అట్లనే 98 ఏండ్ల ఈడుకున్న మఖన్ లాల్ అనే సీనియర్ బీజేపీ కార్యకర్తకు సన్మానం జేశి పాదాభివందనం జేశిండు. మమతను గద్దె దించాలే. బీజేపీ సర్కార్ ఏలువడిలకు పచ్చింబెంగాల్ రాష్ట్రాన్ని తీస్కరావాల్నని కలలుగన్న పువ్వు పార్టీ పెద్దల కలనైతె నిజమయ్యేటాళ్లకు మోడీ సారు ఏండ్ల సంది పువ్వు పార్టీ కోసం పన్జేస్తున్నోళ్లను గుర్తించుకుంటం, గౌరవించుకుంటమని సూయించేతందుకు ఇట్ల జేశినట్టున్నడు.
ఇగీ ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని పువ్వు పార్టీ రాష్ట్ర ఆఫీసుల టీవీల జూశ్న సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సారు డప్పు కొట్టుకుంట సంబరాలు చేసుకున్నరు. పచ్చిం బెంగాల్ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏలువడిల నభూతో నభవిష్యత్ అన్న రేంజిల అభివృద్ధి అయితదని జెప్పుకచ్చిర్రు లీడర్లు. అట్లనే రావోయే రోజుల్ల తెలంగాణల సుతం డబుల్ ఇంజన్ సర్కార్ ఏలువడిలకస్తదని అంటున్నరు. సూడాలె మరి ఉత్తరాధితోనట్టుగ, ఈశాన్యంల గుడ పాగా ఏశ్న పువ్వు పార్టీ సౌత్ ల ఎట్ల పన్జేస్తది, అధికారంలకు రావడానికి ఏం వ్యూహాలు జేస్తదనేది.




