Big Debate: SIR ఓటర్ జాబితా సవరణపై తీవ్ర ఆందోళనలు.. ఇది ఓట్ల ప్రక్షాళన కాదా, ఏరివేత ప్రక్రియనా?
Big Debate: ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Big Debate: SIR ఓటర్ జాబితా సవరణపై తీవ్ర ఆందోళనలు.. ఇది ఓట్ల ప్రక్షాళన కాదా, ఏరివేత ప్రక్రియనా?
Big Debate: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ తీవ్ర దుమారం రేపుతోంది. అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకే ఈ ప్రక్రియను అమలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ లిస్ట్‌లో పేర్ల మిస్‌మ్యాచ్, సాంకేతిక లోపాలు మరియు నిబంధనల పేరుతో సామాన్య ప్రజల నుంచి ఏకంగా ప్రజాప్రతినిధులు, మంత్రుల వరకు నోటీసులు అందుతుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై తాజాగా జరిగిన డిబేట్ కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకులు, నాయకులు ఎలక్షన్ కమిషన్ మరియు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును సులభతరం చేయాల్సింది పోయి, రకరకాల నిబంధనలతో ఓటర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని ప్యానెలిస్టులు మండిపడ్డారు. దశాబ్దాలుగా ఓటు హక్కు కలిగి ఉండి, క్రమం తప్పకుండా ఎన్నికల్లో ఓటు వేస్తున్న సీనియర్ సిటిజెన్‌లకు కూడా కొత్తగా నోటీసులు వస్తుండటాన్ని తప్పుపట్టారు. కేవలం ఇనిషియల్స్ ఎక్స్‌పాండ్ చేయడంలో, పేర్ల మధ్య చిన్నపాటి అక్షర దోషాలు (మైనర్ అనామలీస్) ఉన్నాయనే కారణంతో ఏకంగా వేల సంఖ్యలో నోటీసులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్యులే కాకుండా ఏకంగా మంత్రులు, పీసీసీ అధ్యక్షులు వంటి ప్రముఖులకు సైతం నోటీసులు వెళ్లడం ఈ వ్యవస్థలోని లోపాలకు నిదర్శనమని ఎత్తిచూపారు.
ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశమైనా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు, నమోదును సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తుందని, కానీ ఇక్కడ మాత్రం ఓట్లను ఏరివేసే (Elimination) ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ సాగుతున్నట్లు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సుమారు 93 లక్షల వరకు అనామలీస్ ఉన్నట్లు తేలగా, ఏ బూత్‌లో ఎవరికి నోటీసులు వచ్చాయి, లోపాలు ఏమిటనే దానిపై స్పష్టత కరవైంది. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటి పత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, కేవలం సాంకేతిక అంశాలను భూతద్దంలో చూపి ఓటర్లను బ్లాక్‌మెయిల్ చేసేలా వ్యవహరిస్తున్నారని ప్యానెలిస్టులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటర్ జాబితా సవరణ పేరుతో సాగుతున్న ఈ గందరగోళానికి ఎన్నికల సంఘం తక్షణమే స్పష్టతనిచ్చి, ప్రజల ఇబ్బట్లు తొలగించాలని డిమాండ్ చేశారు.




