News Analysis: సొంత ప్రభుత్వ సంక్షోభం.. దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై నిప్పులు: బిజెపి నేత శ్రీవర్ధన్
News Analysis: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన అనుమతుల నిరాకరణ వివాదాన్ని, సొంత ప్రభుత్వంలో వస్తున్న సంక్షోభాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై నిందలు వేస్తున్నారని హెచ్‌ఎమ్‌టీవీ (HMTV) న్యూస్ అనాలిసిస్‌లో బిజెపి (BJP) నేత శ్రీవర్ధన్ చేసిన విమర్శలు.
News Analysis: సొంత ప్రభుత్వ సంక్షోభం.. దృష్టి మళ్లించేందుకే కేంద్రంపై నిప్పులు: బిజెపి నేత శ్రీవర్ధన్
News Analysis: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం 'పొలిటికల్ క్లియరెన్స్' నిరాకరించడంపై రేగుతున్న రాజకీయ దుమారంపై హెచ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన న్యూస్ అనాలిసిస్ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీవర్ధన్ పాల్గొని స్పందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ లేదా బిజెపికి కాంగ్రెస్ ప్రభుత్వంపై లేదా రేవంత్ రెడ్డిపై ఎలాంటి కక్ష లేదని శ్రీవర్ధన్ స్పష్టం చేశారు. ఒకవేళ కక్షపూరితంగా వ్యవహరించి ఉంటే లండన్ (యూకే) పర్యటనకు అనుమతి ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయం సమర్పించిన పర్యటన షెడ్యూల్ సీఎం హోదాకు తగినట్లు లేకపోవడం వల్లే విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఈ నిరాకరణ తెలిపినట్లు వివరించారు.
Next Story




