Jordar Varthalu: స్కూలు నడుపుతున్నారో.. పుస్తకాల వ్యాపారం చేస్తున్నారో

Jordar Varthalu: స్కూలు నడుపుతున్నారా? పుస్తకాల వ్యాపారం చేస్తున్నారా? ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఆగడాలపై తల్లిదండ్రుల నిరసన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 April 2026 8:02 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: స్కూలు నడుపుతున్నారో.. పుస్తకాల వ్యాపారం చేస్తున్నారో

Jordar Varthalu: వామ్మో.. నోరు తెర్వనిత్తలేదు గదా మేడం. నోట్లకెల్లి కూతెల్తె సాలు, గ్రామసింహంలెక్కనే కయ్యకయ్య లేత్తున్నది. షటప్ షటప్ అనుకుంట, ఆమె ఏదో శెప్పవోతుంటెనే నోరు మూపిత్తున్నది. మరి గీ తల్లి, పిలగాండ్లను సక్కగ బడికి పంపియ్యలేదో.. లేకుంటే.. ఇంటికిచ్చిన హోంవర్కును దగ్గరుండి చేపియ్యలేదో అనుకుంటే.. తప్పుల కాలేశ్నట్టే అయితదుల్లా. మరి గింతకు ఈ మేడం ఆగ్రహావేశాలకు కారణమేందంటే.. బల్లె దొర్కే పుస్తకాలను, బుక్ స్టాల్ల అగ్వకు కొనుడే తప్పైందుల్లా. గీ అక్కోల్లు ఉత్తర్ ప్రదేశ్ దిక్కు హర్దోయ్ అనే ఊర్ల ఉంటరట. ఆడున్న సన్బీమ్ అనే ప్రైవేట్ బల్లెకు ఈల్ల పిల్లలను పంపుతున్నరట. ఇప్పటికే పరీక్షలొడ్శి, కొత్త సాల్ ఛాల్జేశిర్రు గదా కొన్ని దిక్కుల్ల. ఇగైతే.. కొత్త సాల్ వయ్యిలను, ఈ ఇస్కూల్ల గాకుంట.. మార్కిట్ల అగ్వకు కొని స్కూల్ ఆమ్దానీని ఆగం జేస్తున్నరని మేడం, ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అనుకుంట తల్లిదండ్రుల మీదికి ఇట్ల ఫైరైంది. గట్లెట్ల కొంటరని గరమవుకుంట శెప్పేదినకుంటనే నోరు మూపిచ్చింది. ఎక్వ మాట్లాడుతే.. పిలగాండ్లకు టీసీ ఇచ్చి ఎల్లగొడ్తననుకుంట ఆగ్రహావేశాలను ప్రదర్శించింది. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అనుకుంట.. రాజ్యాంగంల సూత్రాలను పక్కా అమలు జేశింది గీ మేడం.

అయినా.. వాజిబే కదా.. ప్రైవేట్ బడంటెనే.. యాపారం. వయ్యిలను అండ్లనే కొనాలె. కనీ., కాదని అవ్తల కొంటమంటె ఊకుంటదా చెప్పుర్రి. ఆమె పొట్టకొడ్తె నిలదియ్యదా చెప్పుర్రి. యథా రాజా తథా ప్రజా అన్నట్టే.. ఇన్ని తిప్పలున్నా ప్రైవేట్ బల్లకు పబ్లిక్ ఎట్ల పోతున్నరో.. సర్కార్లు సుతం, గట్లనే ఉన్నయ్.. వాటిల జరిగే అన్యాయాలకు అడ్డం జెప్పకుంట. మొత్తానికైతే గీ పేరెంట్స్ జెయ్యంగ.. ఈ మేడం, వాళ్ల బడి ప్యాన్ ఇండియా తీర్ల ఫేమసైతున్నది. కనీ., కొంచెం ఉప్పుకారాలు తగ్గిస్తే ఆమెకే మంచిదని ఉద్దెర సలహాలియ్యవట్టిర్రు, ప్రైవేట్ బల్లెను ఎద్రియ్యలేని శానామంది అమ్మనాయ్నలు.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story