Burning Topic: తగలబడుతున్న కాశ్మీర్.. ఏరులై పారుతున్న ర*క్తం..

Burning Topic: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో హింస. నిరసనకారులపై పాక్ సైన్యం కాల్పులు, 30 మంది మృతి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Jun 2026 12:40 PM IST
Burning Topic
X

Burning Topic: తగలబడుతున్న కాశ్మీర్.. ఏరులై పారుతున్న ర*క్తం..

Burning Topic: ఆక్రమిత కశ్మీర్ ప్రజల కష్టాలు రోజు రోజుకీ తీవ్రమవుతున్నాయి. పాకిస్థాన్ పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆర్మీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయి తిరుగుబాటు జరుగుతోంది. పీవోకేలో ఆర్థిక, రాజకీయ సమస్యలపై నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖ పౌర సమాజ కూటమి 'జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ - జేఏఏసీ' ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. గత మూడు రోజులుగా మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర అశాంతి, హింస చెలరేగుతున్నాయి.. తాజాగా శాంతి భద్రతల సాకుతో పాకిస్థాన్ ప్రభుత్వం జేఏఏసీని చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించింది. వ్యతిరేకంగా రావల్‌కోట్ నగరంలో నిరసనలు చేస్తున్న పౌరులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. దీనితో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో పలువురు భద్రతాసిబ్బంది సహా మొత్తం 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు ప్రకటించారు. అయితే మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆర్థిక, రాజకీయాలకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ముఖ్యంగా పీవోకేలో ఇంతకు ముందు జరిగిన హింసాత్మక ఘటనలు, ఇంటర్నెట్ నిలిపివేత, విద్యుత్ కొరత, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వనరుల దోపిడీ, రాజకీయ వివక్ష మొదలైన సమస్యలపై పోరాడుతోంది.ఈ క్రమంలోనే, జులై 27న ఆక్రమిత కశ్మీర్​శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని పాకిస్థాన్ నిర్ణయించింది. శాసనసభలో ఉన్న మొత్తం 45 స్థానాల్లో 12 స్థానాలను పీవోకేకు చెందని పాకిస్థాన్ జాతీయులకు రిజర్వేషన్​చేసింది. దీని వల్ల స్థానికుల హక్కులు దెబ్బతింటాయంటూ జేఏఏసీ ఉద్యమిస్తోంది. ఈ క్రమంలో ఆ సంస్థకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని పాక్ ఆరోపించింది. ప్రజాశాంతి, భద్రతకు ముప్పు ఉందనే కారణం చూపిస్తూ ఈ సంస్థను నిషేధించింది. జేఏఏసీ సభ్యులు తమను ఉగ్రవాద సంస్థగా జాబితాలో చేర్చడాన్ని అణచివేతగా పేర్కొన్నారు. తాము చట్టబద్ధమైన ఆర్థిక, రాజకీయ హక్కుల సాధన కోసమే నిరసనలు చేస్తున్నామని చెప్పారు.

తాజాగా రాత్రి సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక వ్యాపారి మరణించాడు. దీనితో పీవోకేలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. రావల్​కోట్​ నగరంలో సైన్యానికి, నిరసనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. పోలీసుల కాల్పుల్లో మరణించిన వ్యాపారి మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. దీనిలో అక్కడ జేఏఏసీ మద్దతుదారులు భారీగా గుమిగూడారు. వారిని చెదరగొట్టడానికి చూశాయి. జేఏఏసీ కార్యకర్తలు ఆటోమేటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో దాడులకు దిగారని, దీనిని అడ్డుకోవడానికి భద్రతా దళాలు కాల్పులు జరపాల్సి వచ్చిందని రావల్​కోట్​కమిషనర్​సర్దార్​వహీద్​ఖాన్​తెలిపారు ఈ ప్రకటనను స్థానికులు, జేఏఏసీ మద్దతుదారులు ఖండించారు. కాగాజేఏఏసీని నిషేధించడంపై పాకిస్థాన్ మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా దళాలు నిరసనకారులపై మితిమీరి బలప్రయోగం చేసిందని విమర్శించింది. వారిపై కాల్పులు జరపడాన్ని ఖండించింది.

కాగా జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసనల సాకుతో ఆక్రమిత కశ్మీర్‌ను రెండుగా విడగొట్టాలని ప్రయత్నిస్తోందని అక్కడి ప్రధానమంత్రి ఫైసల్ ముంతాజ్ రాథోర్ ఆరోపించారు. భవిష్యత్తులో వీరు మితిమీరిన హింసకు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు తమ నిఘా వర్గాల సమాచారంలో తేలిందన్నారు అందుకే ఈ కమిటీని నిషేధించాల్సి వచ్చిందని ఇప్పటికైనా వారు హింసను వీడి ప్రభుత్వంతో చర్చలకు రావాలి” అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ లాంటి వాతావరణం నెలకొంది. ఇటు ప్రజలు, అటు పాక్ సైన్యం వెనక్కి తగ్గకపోవడంతో కాశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజు రోజుకీ తీవ్రమవుతున్నాయి. అదే సమయంలో అక్కడి ప్రజలు తమను భారత్‌లో కలపాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వం తమ ఆకాంక్షలను పట్టించుకోకుండా అక్కడి మొండిగా వ్యవహరిస్తోందని అంటున్నారు.

మరోవైపు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఘటనలకు భారత్ ఖండింది. అక్కడి ప్రజలపై మారణహోమం సృష్టించిన పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తన వ్యవస్థీకృత వైఫల్యాలను, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకోవడానికి ఇస్లామాబాద్​అసత్య ప్రచారాలను చేస్తోందని విమర్శించింది. అక్కడి నుంచివస్తున్న నకిలీ వార్తలను, అసత్య ప్రచారాలను గమనిస్తూనే ఉన్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పాకిస్థాన్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి దృష్టిని ప్రయత్నిస్తోందని ఆరోపించింది. పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో పలువురు నిరసనకారులు మరణించగా, మరెంతో మంది తీవ్రంగా గాయపడినట్లు నివేదికలు వచ్చాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్​వెల్లడించారు.అంతర్జాతీయ సమాజం పాక్ దుశ్చర్యలను, మానవ హక్కుల ఉల్లంఘనలను ఖండించాలని, ఇందుకు పాకిస్థాన్​ను జవాబుదారీ చేయాలని కోరుతున్నామని తెలిపారు.

అటు పాకిస్థాన్‌ - ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. తాజాగా పాకిస్థాన్ సైన్యం ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోస్ట్‌, కునార్‌, పక్తికా ప్రావిన్స్‌లలోని పౌర నివాసాలే లక్ష్యంగా వైమానికి దాడులకు దిగింది. ఖోస్ట్‌ ప్రావిన్స్‌‌లోని సెర్పా జిల్లాలోని ఓ ఇంటిపై జరిగిన దాడిలోనే 9 మంది చనిపోయారని, మరో 10 మంది గాయపడ్డారు. పక్తికా ప్రావిన్స్‌లోని బర్మల్‌ జిల్లాలో జరిగిన మరో దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా చిన్నారులేనని స్థానికులు తెలిపారు. బాధితులు నిద్రిస్తున్న సమయంలో ఈ దాడులు జరగడంతో.. వారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ దాడి ఘటనలో మొత్తం 11 మంది చిన్నారులతో సహా ఓ మహిళ, ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడగా.. వారిలో అనేకమంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. మృతి చెందిన చిన్నారుల ఫొటోలను ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ సోషల్ మీడియాలో విడుదల చేశారు. కాగా ఈ ఘటనపై పాకిస్థాన్ ఎలాంటి ప్రకటనా చేయలనేదు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story