Jordar News: సడన్ గా చూసి మోదీ సార్ అనుకున్నాను

Jordar News: ప్రధాని నరేంద్ర మోదీని పోలి ఉన్న వికాస్ మహంతే అనే వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 May 2026 10:57 AM IST
Jordar News
X

Jordar News: సడన్ గా చూసి మోదీ సార్ అనుకున్నాను

Jordar News: అగో ఎవ్వలనో సూపెడ్తమని జెప్పి పీఎం మోడీ సారును సూపెడ్తారేందుల్లా అని అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టే. ఎందుకంటె గీడ కానోస్తున్నది మోడీ సారు కానే కాదువట్టి. అగో మరింకెవ్వలు అనంటరా.. హీరోలకు డూపు లెక్క మోడీ సారుకు డూపు అసోంటాయినోల్ల గీనే. మురారీ కళాకారుడట ఈ కాకా. పేరు వికాస్ మహంతే. ఉండేది మహారాష్ట్ర రాష్ట్రం. అచ్చం మోడీ సారు లెక్కుండేటాళ్లకు ఎప్పటినుంచో మస్తు ఫేమస్ ఈ కాకా.

నిజంగ తెల్వనోళ్లయితే మోడీ సారే అనుకునేటట్టు ఉంటడు. ఉండుడే గాదు.. తెల్వక మోడీ సారే అనుకోని పర్యాన్ అయ్యేటోళ్లకు లెక్కే లేదుల్లో. ఇగో ఈడ ఈ వీడియోల సుతం ఆ నల్ల పైజామా ఏసుకున్న అన్న సుతం గట్లనే ఐండు పర్యాన్. మరి కారా ఉల్లా.. మోడీ సారు లెక్కున్నే రూపం, మోడీ సారు లెక్కున్నే కండ్లకు అడ్డాలు, మోడీ సారు లెక్కున్నే బట్టలు.. మోడీ సారు లెక్కున్నే హావభావాలు.. మొత్తంగ మోడీని దించిండు వికాస్ మహంతే కాకా.. తెల్వనోళ్లయితే పక్కా పాకెతరు కాకను షిట్ట షిమాంట సూత్తె. మరి మీకేం అనిపిస్తున్నదుల్లా ఈ వార్త సూశేటి పబ్లిక్కు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story