Jordar Varthalu: మోదీ నా... మజాకా
Jordar Varthalu: ప్రధాని మోదీ సారు చెప్పిన మాటలకు దేశవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది!
Jordar Varthalu: మోదీ నా... మజాకా
Jordar Varthalu: మొన్న పీఎం మోడీ సారు ఐద్రవాదు సభల కొన్ని రూల్సు శెప్పంగనే శానామంది అట్లెట్ల అన్నరు గని, ఇంకొందరు పక్కాగా పాటిస్తున్నరుల్లో. పెట్రోల్, డీజిల్ వాడ్కం తగ్గియ్యాల్నని పీఎం సారు శెప్పినట్టే బొంబాయిల సెంట్రల్ మంత్రి రామ్ దాస్ అథవాలే సారు మెట్రోల జేశిండు ప్రయాణం. అటు ఢిల్లీ సద్వుల మంత్రి ఆశిష్ సూద్ సారు సుతం ఓ బడి మీటింగు పొయ్యేదుండంగ బడి దాంక మెట్రోలనే పేండు. మెట్రో దిగినంక గుడ కారు వాడకుంట ఈ-రిక్షాల పోయిండట సారు. ఒక్క లీడర్లే కాదుల్ల ఇట్ల.. పీఎం మోడీ సారంటాయినె చెప్పేటాళ్లకు, కామన్ పబ్లిక్కు కాన్నుంచి అధికార్లు, అధికారంలున్న లీడర్లదాంక పెట్రోల్, డీజిల్ ఆదా జేశే కార్యం ముంగటేస్కుంటున్నరు. ఇగ లీడర్లు అట్ల మెట్రో ఎక్కుతె, మోడీ సారు మాటకు విల్విచ్చి ఇయ్యల్ల మూడు కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటనే పేండు కోర్టుకు మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ ద్వారకా దీశ్ బన్సల్ సారు. మొత్తానికి పబ్లిక్కు శెప్పుడు గాదు.. లీడర్లు శేశి సూపెట్టాలె మొదాలు అని కొందరు కామన్ పబ్లిక్కు కోరుతున్నట్టే లీడర్లు చేస్తున్నరు. మరి ఈల్లను సూశి కామన్ పబ్లిక్కు సుతం పీఎం మోడీ సారు చెప్పిన బాటల నడ్తరో సూడాలె రేపు మాపిగ.




