Jordar News: ప్లాస్టిక్ కు పాడే కట్టేసారు
Jordar News: పర్యావరణ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో ప్లాస్టిక్ భూతానికి అంతిమ యాత్ర.
Jordar News: ప్లాస్టిక్ కు పాడే కట్టేసారు
Jordar News: అగో.. ఏదో భూతమన్నరు.. ఈడ సూత్తె సావు డప్పు మోగుతాందేదుల్ల అని పర్శాన్ గాకుర్రుల్ల. ఒక్కసారి పుట్టి సావన్నదే లేకుంట భూతల్లికి, భూమ్మీదున్న జీవరాశికి బుగులు పుట్టిస్తున్న ప్లాస్టీక్కు పాడె కట్టి శవయాత్ర జేశిర్రిట్ల వరంగల్ పట్నంల. ఇయ్యల్ల అంతర్జాతీయ పర్యావరణ దినోవత్సం కావట్టి ఈ కార్యం ముంగటేస్కున్నడు వరంగల్ పట్నంల జ్వాల అనేటి సంస్థను నడ్పుతున్న ప్రశాంత్ అనేటి ఈ అన్న. తనవంతు ప్రయత్నంగ మనుషులను పోగేశి ప్లాస్టీక్కు పాడె కట్టి శవయాత్ర జేశిండు పట్నమంత. శిన్నా, పెద్ద అందరు భాగమయ్యిర్రు ఈ కార్యంల. సింగిల్ యూజ్ ప్లాస్టీక్, అంటె ఒక్కసారి వాడి పారేశి ప్లాస్టీకునంత పోగేశి, దానికి మన్శి ఆకారంలకు మార్శి దానికి శవయాత్ర జేస్తుంటె తొవ్వల మీద సూశినొల్లంత మస్తు పర్శాన్ అయిర్రుల్ల. కడ్మ ముచ్చట ప్రశాంతన్న శెప్తడు ఇనుర్రి.
అన్న శెప్పింది అక్షరాల నిజముల్ల.. అండ్ల కలదు, ఇండ్ల లేదని అన్మానమే లేదు. ఎండ్ల సూశినా ప్లాస్టీకే.. ఆఖర్కు మన రక్తంల గుడ కల్శిపొయ్యి తీరు తీరు రోగాలకు కార్నమైతాందీ ప్లాస్టీకు భూతం. అందుకే జనాలకు అవగాహన కల్పించేతందుకు ఈ కార్యం ముంగటేస్కున్నడట ఈ అన్న. మంచి పనే. వెయ్యి స్థంబాల గుడి కాన్నుంచి కలెక్టరేట్ దాంక తీశిర్రటిట్ల ర్యాలీ. మరిగ ఇట్ల జనాలందరిల మార్పచ్చి ప్లాస్టీకు భూతానికి నిజంగనే పాడె కట్టి, పాతరేశే రోజు రావాల్నని ఈ అంతర్జాతీయ పర్యావరణ దినోవత్సం యాల్ల మా జోర్దార్ వార్తల తర్పున గుడ కోరుకుంటున్నమిగ.




