News Analysis: ప్రతిపక్ష నేత అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?.. ఇందిరా శోభన్ సంచలన వ్యాఖ్యలు
News Analysis: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, వెయ్యి రోజుల పాలన మరియు కేసీఆర్ రాజీనామా డిమాండ్‌పై హెచ్‌ఎంటివి ప్రత్యేక న్యూస్ అనాలిసిస్.
News Analysis: ప్రతిపక్ష నేత అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?.. ఇందిరా శోభన్ సంచలన వ్యాఖ్యలు
News Analysis: తెలంగాణలో వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్షాల తీరుపై హెచ్‌ఎంటివి ప్రత్యేక డిబేట్ నిర్వహించింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరుణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా డిమాండ్, అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంపై ఈ చర్చ కొనసాగింది. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఫార్మ్‌హౌస్‌కే పరిమితమవ్వడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ ప్రశ్నించారు.
అదే సమయంలో గత పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని పక్కన పెట్టి, కేవలం రాజకీయ లబ్ది కోసమే అధికార పక్షం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి. రాష్ట్రంలో వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పనున్నాయనే అంశంపై పూర్తి వివరాలు వీడియోలో చూడండి.




