News Analysis: తిరుపతి రెడ్డికి ఆరుగురు గన్‌మెన్లు ఎందుకు?.. బీఆర్ఎస్ నేత రాకేష్ సంచలన ప్రశ్న

News Analysis: తిరుపతి రెడ్డికి ఆరుగురు గన్‌మెన్లు ఎందుకు కేటాయించారంటూ బీఆర్ఎస్ నేత రాకేష్ చిర్మిళ సంచలన ప్రశ్నలు సంధించారు.

Arun Chilukuri
Published on: 7 Sept 2026 11:15 AM IST
News Analysis
X

News Analysis: తిరుపతి రెడ్డికి ఆరుగురు గన్‌మెన్లు ఎందుకు?.. బీఆర్ఎస్ నేత రాకేష్ సంచలన ప్రశ్న

News Analysis: తెలంగాణలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన, ప్రతిపక్షాల తీరుపై హెచ్‌ఎంటివి నిర్వహించిన ప్రత్యేక డిబేట్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాకేష్ చిర్మిళ తీవ్రస్థాయిలో స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ భద్రతపై అధికార పక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. అసలు తిరుపతి రెడ్డికి ఆరుగురు గన్‌మెన్లు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకు అంత ప్రాధాన్యత ఏంటని నిలదీశారు.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాకేష్ చిర్మిళ ఆరోపించారు. రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయలు, మేనిఫెస్టో హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ చర్చకు సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story