News Analysis: విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం ఎందుకు? ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్
News Analysis: విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం ఎందుకు? ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్‌తో హెచ్‌ఎమ్‌టీవీ న్యూస్ అనాలిసిస్ ప్రత్యేక చర్చ.
News Analysis: విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం ఎందుకు? ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్
News Analysis: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మరియు విద్యా రంగంలోని సమస్యలపై హెచ్‌ఎమ్‌టీవీ నిర్వహించిన న్యూస్ అనాలిసిస్ చర్చా వేదికలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ పాల్గొని ప్రభుత్వ వాదనను వినిపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పథకమని, విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా బకాయిలు చెల్లిస్తూ వస్తున్నామని ఇందిరా శోభన్ తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చలు జరుపుతూ వెసులుబాటు కల్పిస్తోందని చెప్పారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయడం తగదని ఆమె హితవు పలికారు.




