News Analysis: విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతున్నారు.. ఫీజు బకాయిలపై సుమిత్ర ఆనంద్ ఆగ్రహం
News Analysis: ప్రజలను చదువుకు దూరం చేసి రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలా? ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బీఆర్ఎస్ నేత సుమిత్ర ఆనంద్‌తో హెచ్‌ఎమ్‌టీవీ న్యూస్ అనాలిసిస్.
News Analysis: విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతున్నారు.. ఫీజు బకాయిలపై సుమిత్ర ఆనంద్ ఆగ్రహం
News Analysis: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని, ఇది ప్రజలను చదువుకు దూరం చేసి రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకోవడమేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్ర ఆనంద్ హెచ్‌ఎమ్‌టీవీ న్యూస్ అనాలిసిస్ చర్చా వేదికలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదంటూ ప్రస్తుత ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని ఆమె విమర్శించారు.
రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీలు, పాఠశాలల నిర్వహణ భారంగా మారిందని, నిరుద్యోగులు, స్థానిక విద్యావేత్తలు నడుపుతున్న బడ్జెట్ కాలేజీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సుమిత్ర ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు బంద్‌లు నిర్వహించినా, అల్టిమేటాలు జారీ చేసినా ప్రభుత్వంలో స్పందన లేదని, ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించకపోగా వాటిని ఇబ్బంది పెడుతూ స్థానిక ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకపోతే పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని, ప్రభుత్వాలు ఈ అంశాన్ని బాధ్యతగా తీసుకుని బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.




