News Analysis: తెలంగాణలో నిషేధిత భూముల వివాదం.. ప్రభుత్వంపై దూదిమెట్ల బాలరాజు తీవ్ర విమర్శలు
News Analysis: తెలంగాణలో నిషేధిత భూముల (22A Lands) వివాదం, కోటి ఎకరాల భూముల దందాపై హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో బీఆర్ఎస్ నేత డాక్టర్ దూదిమెట్ల బాలరాజు చేసిన కీలక వ్యాఖ్యల విశ్లేషణ.
News Analysis: తెలంగాణలో నిషేధిత భూముల వివాదం.. ప్రభుత్వంపై దూదిమెట్ల బాలరాజు తీవ్ర విమర్శలు
News Analysis: రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలన్నీ భూములు, 22ఏ (22A) నిషేధిత జాబితా చుట్టే తిరుగుతున్నాయి. ప్రభుత్వం ఒకవైపు కేవలం 3.06 లక్షల ఎకరాలే నిషేధిత జాబితాలో ఉన్నాయని చెబుతుంటే, బీఆర్ఎస్ మాత్రం కోటి ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితాలో పెట్టి పెద్ద దందా నడిపిస్తోందని తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ అంశంపై హెచ్‌ఎంటీవీ నిర్వహించిన ప్రత్యేక చర్చా వేదికలో (News Analysis) బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు పాల్గొని పలు కీలక విషయాలు వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ అనుభవం ఉండటం వల్లే రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూముల గురించే చర్చ జరుగుతోందని బాలరాజు విమర్శించారు. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ వంటి అన్ని జిల్లాల్లోనూ 22ఏ బాధితులు రోడ్డెక్కుతున్నారని తెలిపారు.




