News Analysis: విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.. హస్తిన ఆందోళనలపై కాంగ్రెస్ నేత కృష్ణతేజ హాట్ కామెంట్స్!
News Analysis: ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు, నీట్ పేపర్ లీకేజీ మరియు ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నాపై hmtv న్యూస్ అనాలిసిస్‌లో కాంగ్రెస్ నాయకుడు కృష్ణతేజ కామెంట్స్.
News Analysis: విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.. హస్తిన ఆందోళనలపై కాంగ్రెస్ నేత కృష్ణతేజ హాట్ కామెంట్స్!
News Analysis: ఢిల్లీలో నీట్ (NEET) పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలపై విద్యార్థులు చేపట్టిన నిరసనలు, ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడంపై hmtv న్యూస్ అనాలిసిస్ కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చలో కాంగ్రెస్ నాయకుడు కృష్ణతేజ పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ మొదటి నుంచి విద్యార్థులు, నిరుద్యోగుల వైపే ఉన్నారని, నీట్ పేపర్ లీక్ అయిన తొలిరోజే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేంద్రాన్ని నిలదీశామని తెలిపారు. ఈ ఆందోళనను 27 ఏళ్ల లోపు ఉన్న 'జెన్జీ' (GenZ) యువత స్వచ్ఛందంగా నడిపిస్తోందని, నిరుద్యోగం అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండి వారి భవిష్యత్తును దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.




